Waltair Veerayya Vs Veera Simha Reddy : వాల్తేరు వీరయ్య ట్రైలర్ Vs వీరసింహా రెడ్డి ట్రైలర్ — ఏది బాగుంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Waltair Veerayya Vs Veera Simha Reddy : వాల్తేరు వీరయ్య ట్రైలర్ Vs వీరసింహా రెడ్డి ట్రైలర్ — ఏది బాగుంది

Waltair Veerayya Vs Veera Simha Reddy : ఈ సంక్రాంతికి బాల‌కృష్ణ‌, చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ర‌చ్చ చేసేందుకు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ `వాల్తేర్‌ వీరయ్య` సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుండ‌గా, రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్‌, కేథరిన్‌ థ్రెస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు రిలీజ్ డేట్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :8 January 2023,4:40 pm

Waltair Veerayya Vs Veera Simha Reddy : ఈ సంక్రాంతికి బాల‌కృష్ణ‌, చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ర‌చ్చ చేసేందుకు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ `వాల్తేర్‌ వీరయ్య` సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుండ‌గా, రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్‌, కేథరిన్‌ థ్రెస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ కు మాస్ రెస్పాన్స్ వస్తోంది.

ఇందులో చిరు కామెడీ, మాస్ యాంగిల్, రవితేజ – చిరు మధ్య సాగే సన్నివేశాలు, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంటోంది. దీంతో యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంటుంది ఈ ట్రైల‌ర్. కేవలం 15 గంటల్లోనే 10 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ ట్రైల‌ర్ 400 ప్లస్ లైక్స్ ను దక్కించుకుంది. ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో థియేటర్లు బద్దలే అని చెబుతున్నారు మెగా ఫ్యాన్స్. ఇక వీర‌సింహారెడ్డి ట్రైల‌ర్ కూడా ఇటీవ‌ల రిలీజ్ కాగా ఇది కూడా ఎంత‌గానో అల‌రిస్తుంది. వీరసింహారెడ్డి ఫుల్ ప్యాకేజీ అనిబాలయ్య బాబు అభిమానులు

Waltair Veerayya vs Veera Simha Reddy who wins in the game

Waltair Veerayya vs Veera Simha Reddy who wins in the game

Waltair Veerayya Vs Veera Simha Reddy : ఎవ‌రిది గెలుపు

పండగ చేసుకునేలా వుంటుందని అన్నారు మేక‌ర్స్. ఇందులో `సంతకాలు పెడితే బోర్డ్ మీద పేరు మారుతుందేమో కానీ..చరిత్ర సృష్టించినవాడి పేరు మారదు.. మార్చలేరు! “ అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగులు ఎంత‌గానో పేలాయి. సాయి మాధ‌వ్ బుర్రా ఈసినిమా ఎలా ఉంటుందో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హింట్ ఇచ్చిప‌డేశాడు. ఏదేమైన ఈ సంక్రాంతికి రెండు గ‌ట్టిగా పోటాప‌డ‌బోతున్నాయి. ఎప్పుడు సంక్రాంతి బ‌రిలో బాల‌య్య‌కే అదృష్టం క‌లిసి వ‌స్తుండ‌గా, ఈ సారి ఎవ‌రు గెలుస్తారో చూడాలి. కాగా, ఇటీవ‌ల విడుద‌లైన‌ ‘వీరసింహారెడ్డి’కి 14 గంటల్లో కేవలం 5 మిలియన్స్ వ్యూసే దక్కాయి. ఈ రకంగా వీరయ్య క్రేజ్ ఎంతగా ఉందో అంద‌రికి అర్థం అవుతోంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది