Bandla Ganesh : మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చిన బండ్ల గణేష్ ప్రస్తుతం ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగి మంచి మంచి సినిమాలను చేస్తూ మంచి లాభాలను అందుకుంటున్నాడు. అయితే చాలామంది బండ్ల గణేష్ కు కొంచెం నోటి దురద ఎక్కువ అని అంటుంటారు. ఎందుకంటే ఎప్పుడు కాంట్రవర్షల్ కామెంట్స్ చేస్తూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంటాడు. అంతకుముందు పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఇప్పుడు రవితేజ లాంటి స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన
మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.ఇటీవల రవితేజ ‘ ధమాకా ‘ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న బండ్ల గణేష్ రవితేజను ఓ రేంజ్ లో పొగిడారు. రవితేజ స్వయంకృషితో పైకి వచ్చాడనీ, ఒకటి రెండేళ్లు కష్టపడి కొందరు అదృష్టంతో మెగాస్టార్, సూపర్ స్టార్స్ అయిపోతారు. రవి తేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి, ఆ తర్వాత ప్రొడక్షన్ బాయ్ గా చేసి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు అని అన్నారు. దీంతో మెగాస్టార్, సూపర్ స్టార్ అభిమానులు హర్ట్ అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో బండ్ల గణేష్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
అయితే జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ కి పరోక్షంగా రియాక్ట్ అయ్యాడు. షకలక శంకర్ మాట్లాడుతూ మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడాలి. మెగాస్టార్, సూపర్ స్టార్స్ అదృష్టం కొద్ది అవ్వరు, అన్నం నీళ్లు లేక నిద్ర లేక రాత్రింబవళ్లు కష్టపడితే, ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తే ఆ స్థాయికి వస్తారు, ఈ మాటలు ఎవరికీ తగలాలో వారికి తగులుతాయి అని పరోక్షంగా బండ్ల గణేష్ ని అన్నాడు.
Keerthy Suresh Relationship : మహానటి కీర్తి సురేష పెళ్లి గురించి కొన్నాళ్లుగా నెట్టింట అనేక వార్తలు వస్తున్న విషయం…
Smartphone : డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్లు రోజువారీ జీవితంలో ఒక అనివార్య భాగంగా మారాయి. కమ్యూనికేషన్, వినోదం మరియు సమాచార…
Vishnu Priya : బిగ్ బాస్ సీజన్ 8 Bigg Boss Telugu 8 మరి కొద్ది రోజులలో ముగియనున్న…
Lemon Water : నిమ్మకాయ నీరు సాధారణంగా ఫిట్నెస్ ఔత్సాహికులందరినీ ఏకం చేస్తుంది. ఉదయాన్నే లెమన్ వాటర్ తాగడం నుంచి…
Eye Blurry : ఉదయం లేవగానే ఒకటి లేదా రెండు కళ్లలో చూపు మసకబారడం చాలా మందికి జరుగుతుంది. చాలా…
Samantha : దక్షిణాది బ్యూటీ సమంత ఇప్పటికీ టాలీవుడ్లో క్రేజీ భామగానే ఉంది. ఆమె ఇటీవల నటించిన వెబ్ సిరీస్…
Coffee : ప్రపంచవ్యాప్తంగా కాఫీ అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఎక్కువగా వినియోగించే పానీయాలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కాఫీ అధిక…
Chandrababu : ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇల్లు మరియు కార్యాలయం సౌరశక్తిని కలిగి ఉండాలని, విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగంలో స్వావలంబన…
This website uses cookies.