Krishna – NTR : ఎన్టీఆర్, కృష్ణకి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Krishna – NTR : ఎన్టీఆర్, కృష్ణకి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేది…!

 Authored By sandeep | The Telugu News | Updated on :15 November 2022,12:00 pm

Krishna – NTR : ఆకాశంలో ఒక తార.. నాకోసం వచ్చింది ఈవేళ అంటూ ప్రేక్షకుల మనసులను ఉర్రూతలూగించిన సూపర్ స్టార్ న‌వంబ‌ర్ 15 తెల్ల‌వారుజామున‌ కృష్ణ క‌న్నుమూసారు. సినీ వినీలాకాశంలో తనదైన స్టైల్ లో ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించిన సూపర్ స్టార్ కృష్ణ ఎవరికీ అందని అనంతలోకాలకు చేరిపోవ‌డంతో అభిమానులు క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. ఆదివారం రోజు అర్ధరాత్రి కార్డియాక్ అరెస్ట్ కు గురి కావ‌డంతో సూపర్ స్టార్ కృష్ణని వెంట‌నే కాంటినెంటల్ హాస్పటల్ కి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌నకు సంబంధించిన ఎన్నో విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

ఎన్టీఆర్-కృష్ణ అతిపెద్ద మాస్ హీరోలుగా తెలుగు తెరను ఏలడంతో పాటు కలిసి మల్టీస్టారర్స్ చేశారు. కాని కొద్ది రోజుల త‌ర్వాత వీరిద్దరి మధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేది. ఏపీలో ఎన్టీఆర్ విధి విధానాల పట్ల విమ‌ర్శ‌లు కురిపిస్తూ ప‌లు సినిమాలు చేశారు. 1986లో కృష్ణ దర్శకత్వంలో సింహాసనం మూవీ విడుదల కాగా, ఇందులో సత్యనారాయణ లుక్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ధరించిన కాషాయ వస్త్రధారణ లుక్ లా ఉంటుంది.ఇక‌ ఈ మూవీలో సత్యనారాయణ చేత ఎన్టీఆర్ తరచుగా చెప్పే… ‘ఏముంది నా దగ్గర బూడిద’ అనే డైలాగ్ చెప్పించి హాట్ టాపిక్ అయ్యారు.. త‌ర్వాత అదే ఏడాది వ‌చ్చిన‌ ‘నా పిలుపే ప్రభంజనం’ మూవీ , కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి దర్శకుడిగా మండలాధీశుడు మూవీలోను ఎన్టీఆర్‌ని విమ‌ర్శించే ప్ర‌య‌త్నం చేశారు.

war between ntr and krishna

war between ntr and krishna

Krishna – NTR : ఎందుకంత విభేధాలు..!

ఎన్టీఆర్ పై కృష్ణ సంధించిన మరొక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ సాహసమే నా ఊపిరి కాగా,ఈ చిత్రానికి కృష్ణ భార్య విజయనిర్మల డైరెక్టర్ గా ప‌ని చేశారు, నరేష్ కీలక రోల్ చేశారు. ఈ మూవీలో ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ అనేక పొలిటికల్ సెటైర్స్, విమర్శనాస్త్రాలు ఉంటాయి. అనంత‌రం వచ్చిన గండిపేట రహస్యం మూవీలో ఎన్టీఆర్ ని అయితే దారుణంఆ విమ‌ర్శించారు. అయితే అనూహ్యంగా కృష్ణ చేసిన ఒక సినిమా ఎన్టీఆర్ కి రాజకీయంగా మేలు చేసిందనే చెప్పాలి.. ఈనాడు టైటిల్ తో కృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో కాంగ్రెస్ విధానాలను తప్పుబట్టగా, ఈ సినిమా కొంత ఎన్టీఆర్‌కి క‌లిసి వ‌చ్చింది.. 1982 లో ఈనాడు విడుదల కాగా 1983 ఎన్నికల్లో గెలిచి ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు.

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది