
what deepa will do after knowing the truth about anand
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 28 ఫిబ్రవరి 2022 ఎపిసోడ్ 1286 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కోటేశ్ బుక్ లో ఏదో కారు నెంబర్ రాయడాన్ని చూస్తుంది దీప. ఎందుకు కోటేశ్ ఇది రాశాడు అని అనుకుంటుంది. ఆ తర్వాత మోనిత ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది. నా కొడుకు దూరం అయినా… వీడిలో నా కొడుకును చూసుకుంటున్నా అని చెప్పి.. ఆనంద్ కోసం కొత్త బట్టలు, ఊయల తీసుకొస్తుంది. దీంతో దీప, సౌందర్యకు కోపం వస్తుంది. ఇంకా ఏం చేద్దామని మా ఇంటికి వస్తున్నావు. ముందు నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపో. వాడు మా బంగారు కొండ అంటుంది దీప. అవునా.. వాడు మీ బంగారు కొండనా అని మనసులో అనుకుంటుంది మోనిత.
what deepa will do after knowing the truth about anand
ఆ తర్వాత మోనితను తన ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది దీప. మరోవైపు పిల్లలు ఇద్దరూ షాపింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తారు. నానమ్మ మేము బట్టలు కొనుక్కున్నాం. బాగున్నాయా చూడండి అని అడుగుతారు. దీంతో బాగున్నాయి అంటుంది సౌందర్య. నానమ్మ.. అమ్మ ఎక్కడుంది అని అడుగుతారు పిల్లలు. దీంతో కూరగాయల కోసం మీ అమ్మ బయటికి వెళ్లింది. వచ్చాక చూపించండి అంటుంది సౌందర్య. తమ్ముడికి కూడా బట్టలు కొందామని అనుకున్నాం కానీ.. మాకు సైజ్ సరిగ్గా తెలియలేదు. తమ్ముడు బాగా ఉంటాడు కదా నానమ్మ. వాడు వచ్చాక మా ఆనందం రెట్టింపయింది. వాడిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేం అంటారు పిల్లలు. నానమ్మ తమ్ముడు ఏడి అని అడుగుతారు పిల్లలు. దీంతో అమ్మ తీసుకెళ్లింది అన చెబుతుంది సౌందర్య.
మరోవైపు కూరగాయలు తీసుకొని దీప.. ఇంటికి తిరిగి వస్తుంటుంది. ఆ మోనిత నిన్ను కూడా వదలడం లేదురా. నిన్ను కూడా ఇవ్వమంటోంది. నువ్వు మాలో ప్రాణం. నువ్వు మాలో ఒకడివి. నిన్ను ఎలా ఇస్తాం అంటుంది దీప. ఇంతలో తనకు ఒక కారు కనపిస్తుంది. ఆ కారు నెంబర్ ను చూసి షాక్ అవుతుంది దీప.
ఈ కారు నెంబర్ ను ఎక్కడో చూసినట్టు ఉందే అని అనుకుంటుంది దీప. కోటేశ్ బుక్ లో రాసిన నెంబర్.. ఇది ఒకటే అని అనుకొని కారులో ఎవరు ఉన్నారో ముందుకు వెళ్తుంది. కారులో లక్ష్మణ్ కూర్చొని ఉంటాడు. లక్ష్మణ్ ను చూసి షాక్ అవుతుంది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు లక్ష్మణ్ అని అడుగుతుంది దీప.
దీంతో ఇది మోనిత కారు అమ్మ అంటాడు లక్ష్మణ్. దీంతో దీప షాక్ అవుతుంది. అంటే.. ఆనంద్ మోనిత బిడ్డా అని అనుకొని అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి రత్నసీతను కలుస్తుంది. రత్నసీత.. కోటేశ్ ఎత్తుకెళ్లిన బిడ్డ వీడియోను దీపకు చూపిస్తుంది.
ఆ వీడియో చూసి దీప.. కుప్పకూలుతుంది. అంటే.. ఇన్ని రోజులు మోనిత కొడుకుతో మేము అనుబంధం పెంచుకున్నామా అని అనుకుంటుంది దీప. ఈ వీడియోను ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తీక్ కు చూపించకు అని అంటుంది దీప.
ఈ బాబు.. మోనిత కొడుకు అని కార్తీక్ కు ఎలా చెప్పాలి అని టెన్షన్ పడుతుంది దీప. తమ్ముడు తమ్ముడు అని పిల్లలు సంబురపడుతున్నారు. వీడు వచ్చినప్పటి నుంచి గాల్లో తేలిపోతున్నారు అని అనుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్తుంది. ఆనంద్ ను తీసుకొని డాబా మీదికి వెళ్తుంది. సౌందర్య కూడా అక్కడే కూర్చొని ఉంటుంది.
వీడిని ఇప్పుడు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది సౌందర్య. దీంతో బోసినవ్వుల పాపాయి వీడు. వీడు చేసిన తప్పేంటి అని సౌందర్యతో అంటుంది దీప. దీంతో సౌందర్య షాక్ అవుతుంది. వీడి ద్వారా మనకు ఒక పెద్ద సమస్య ఎదురైంది కదా అత్తయ్య అంటుంది దీప.
వీడు మోనిత కొడుకని మీకు తెలుసని నాకు తెలుసు అత్తయ్య అంటుంది దీప. దీంతో సౌందర్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.