KCR – YS Sharmila : షర్మిలని కావాలనే రెచ్చగొడుతోన్న కేసీఆర్.. అసలు ప్లాన్ అర్ధం చేసుకున్న జగన్?
KCR – YS Sharmila : తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాల ముందు ఎవ్వరూ పనికిరారు. ఆయన వ్యూహాలు మామూలుగా ఉండవు. ఎవ్వరూ అంచనా వేయలేని విధంగా ఆయన వ్యూహాలు, ఆయన ప్లాన్స్ ఉంటాయి. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేయడంలో దిట్ట. నిజానికి.. సీఎం కేసీఆర్ ఏ పని చేసినా.. ఏ వ్యాఖ్యలు చేసినా వాటి వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ఇప్పుడు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విషయంలోనూ కేసీఆర్ అదే ఫాలో అవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కేసీఆర్ కావాలనే..
షర్మిలను తెలంగాణ రాజకీయాల్లో హైలెట్ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి వైఎస్ షర్మిల గ్రాఫ్ పెరగడానికి ఒకరకంగా సీఎం కేసీఆరే కారణమంటున్నారు. అసలు ఆమె పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో పాదయాత్రలు చేసినా.. వేల కిలోమీటర్లు తిరిగినా రాని ఫేమ్ కేవలం ఒక్క రోజులోనే వచ్చేసింది. షర్మిలను కావాలనే అడుగడుగునా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటుందని దానికి కారణం.. బీజేపీని రాజకీయంగా అడ్డుకోవడమే అని అంటున్నారు. నిజానికి అసలు షర్మిల వెనుక ఎవరు ఉన్నారు అనేదానిపై స్పష్టత లేదు. ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు.
KCR – YS Sharmila : అసలు షర్మిల వెనుక ఎవరున్నారు?
కానీ.. ప్రతి పార్టీ షర్మిలను అవసరమైనప్పుడు తమకు తోచిన విధంగా రాజకీయంగా వాడుకుంటున్నాయి. తాజాగా షర్మిల అమరణ నిరాహార దీక్షను కూడా వాడుకునే అవకాశం ఉంది. తాను తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉండటంతో తెలంగాణ ప్రజల్లోనూ షర్మిల పట్ల కాస్తో కూస్తో మద్దతు లభిస్తోంది. దీంతో షర్మిల కూడా రాజకీయంగా ఇంకా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. షర్మిల వల్ల, తన పార్టీ వల్ల డైరెక్ట్ గా టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు కానీ.. కావాలని బీజేపీని తొక్కేందుకే షర్మిలకు పైకి తీసుకొస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం మరి.. షర్మిల విషయంలో సీఎం కేసీఆర్ ఇంకెన్ని నిర్ణయాలు తీసుకుంటారో?