KCR – YS Sharmila : కేసీఆర్ మీద వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR – YS Sharmila : కేసీఆర్ మీద వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు..!

 Authored By kranthi | The Telugu News | Updated on :28 April 2023,11:00 am

KCR – YS Sharmila : నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన పోరాటమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. ప్రతిపక్షాలు నోరు మూసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేయడం లేదు. 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే గద్దెనెక్కిన కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా వాళ్ల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారు అంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. నేను తెలంగాణ బిడ్డల తరుపున పోరాటం చేస్తున్నా.

ys sharmila comments on telangana cm kcr

ys sharmila comments on telangana cm kcr

వాళ్ల ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నా.. అంటూ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ లో షర్మిల నిరాహార దీక్ష చేస్తూ మాట్లాడారు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే.. వాటి కోసం కోర్టుల నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. దీక్ష అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసి నన్ను జైలుకు పంపించారు. వైఎస్సార్ పాలన ఎక్కడా అమలు కావడం లేదు. నిరుద్యోగుల తరుపున పోరాటం చేయాల్సిన ప్రతిపక్షాలు నోర్మూసుకొని కూర్చొన్నాయి. నేను మాత్రం వారి పక్షాన నిలబడి కొట్లాడుతున్నా.. అంటూ వైఎస్ షర్మిల తెలిపారు.

Sharmila clearly underestimated KCR - English OKTelugu

KCR – YS Sharmila : దివంగత సీఎం వైఎస్సార్ సతీమణినే అడ్డుకుంటారా?

ఆమె ఎవరు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సతీమణి. ఆమెను అడ్డుకుంటారా? టీసేవ్ తరుపున తెలంగాణ ముఖ్యమంత్రికి పది ప్రశ్నలు పంపుతున్నాం. దమ్ముంటే వాటికి సమాధానాలు చెప్పాలి. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ దగ్గర ఉద్యమం ఉంది.. డబ్బులు లేవు. కానీ.. ఇప్పుడు డబ్బులు మాత్రం ఉన్నాయి.. అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. తాను ఎల్లప్పటికీ తెలంగాణ బిడ్డల కోసమే, వాళ్ల ఉద్యోగాల కోసమే పోరాటం చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది