Bimbisara Movie : బింబిసార ఈవెంట్ లో చనిపోయిన అభిమాని మిస్ట్రీపై క్లారిటీ ఏది..!

Authored By aruna | The Telugu News | Published on: August 2, 2022, 8:20 pm

Bimbisara Movie : నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన బింబిసార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శిల్ప కళా వేదికలో ఇటీవలే నిర్వహించిన విషయం తెల్సిందే. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్‌ హాజరు అవ్వడం వల్ల అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. శిల్ప కళా వేదిక లో చాలా తక్కు మొత్తం లో జనాలు పడుతారు. కాని ఎన్టీఆర్‌ రావడం వల్ల వచ్చిన జనాలు ఎక్కువ మంది. దాంతో కాస్త ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవం. ఆ ఇబ్బందుల వల్ల ఎన్టీఆర్‌ అభిమాని సాయిరామ్‌ చనిపోయాడా అనేది ఇప్పటి వరకు క్లారిటీ రావడం లేదు.

శిల్ప కళా వేదిక నుండి డైరెక్ట్‌ గా ఉస్మానియా ఆసుపత్రికి సాయి రామ్‌ ను తీసుకు వెళ్లారు. అంటే అప్పటికే సాయి రామ్‌ చని పోయి ఉంటాడా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆసుపత్రి నుండి ఆంబులెన్స్ వచ్చి ఉస్మానియాకు తీసుకు వెళ్లింది అంటున్నారు. ఆయన ఉస్మానియాకు వెళ్లిన సమయంలో సాయి రామ్‌ పరిస్థితి ఎలా ఉంది.. అసలు ఆంబులెన్స్ ఎలా వచ్చింది.. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియక ఎన్టీఆర్‌ అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.

What is the clarity on the mystery of the dead NTR fan in the Bimbisara Movie event

What is the clarity on the mystery of the dead NTR fan in the Bimbisara Movie event

ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వౌరీ నిర్వహిస్తున్నారు. చనిపోయిన అభిమాని కేసు విషయమై నందమూరి ఫ్యామిలీ కూడా చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు అతి త్వరలోనే ఈ కేసును ఛేదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాని కేసుకు సంబంధించిన విషయాలను మాత్రం వారు బయటకు వెళ్లడించేందుకు ఆసక్తి చూపడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్టీఆర్‌ అభిమాని మృతి కేసు విషయంలో అసలు విషయాలు తెలియాలని అభిమానులు అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఆ అసలు నిజాలు ఎప్పటికి బయట పడేనో చూడాలి.

aruna

No bio available for this author.

  1. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  2. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  3. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  4. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  5. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  6. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  7. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp