Telugu Actor : ఆ దేశంలో పదెకరాల ల్యాండ్..2 ప్యాలెస్‌లు కలిగిన నటుడు ఎవరంటే?
Telugu Actor : తెలుగు చిత్రపరిశ్రమలో చాలా మంది నటీనటులు భారీగా డబ్బులు పొగేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో డబ్బులు భారీగా సంపాదించిన వారిలో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ ఇలా స్టార్ హీరోల పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. కానీ వీరంతా ఇండియాలోనే భూములు, ఇతర ఆస్తులపై పెట్టుబడులు పెట్టారు. కానీ విఠలాచార్య సినిమాలతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచమైన నటుడు నరసింహరాజు మాత్రం ఏకంగా విదేశాల్లోనే ఆస్తులు కొనే స్థాయికి ఎదిగారు.
1970ల కాలంలో అనేక విజయవంతమైన జానపద చిత్రాల్లో నరసింహారాజు నటించారు. అప్పట్లో ఈయన్ను ఆంధ్రా కమల్ హాసన్ అని పిలిచేవారంటే ఈయన యాక్టింగ్ ఏవిధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. నరసింహారాజు నటించిన జగన్మోహిని అనే చిత్రం అప్పట్లో భారీ హిట్ అయ్యింది. టెక్నాలజీ లేని కాలంలోనే విఠలాచర్య అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
Telugu Actor : 110 సినిమాల్లో హీరోగా..
జగన్మోహిని హిట్ తర్వాత ఈయన 110 సినిమాల్లో హిరోగా చేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా,కాలక్రమేణా బుల్లితెరపై కూడా కనిపించారు.పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని మట్లూరులో 1951 డిసెంబర్ 26న ఈయన జన్మించారు. చదువుకునే రోజుల్లోనే సినిమాలపై ఆసక్తి ఉండటంతో మద్రాసు వెళ్లారు. విఠలాచార్యతో పరిచయం అనంతరం ఆయన సినిమాల్లోకి వచ్చారు. ఈయనుకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
కొడుకు ప్రస్తుతం కెనడాలో ఉద్యోగం చేస్తుండగా.. కూతురు పలు విద్యాసంస్థల్లో హెచ్‌ఆర్‌గా విధులు నిర్వహిస్తోంది.ఇక కొడుకు నటుడు కావాలని అనుకున్నా అది సాధ్యపడకపోవడంతో విదేశాలకు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. ఇక అక్కడే పది ఎకరాల స్థలం, రెండు ప్యాలెస్‌లు కొనుగోలు చేశామని.. సమ్మర్ హాలిడేస్‌కు కెనడాకు వెళ్లి సంతోషంగా ఎంజాయ్ చేస్తామని నరసింహారాజు చెప్పుకొచ్చారు.