Veera Simha Reddy Vs Waltair Veerayya : సంక్రాంతి కానుకగా నలుగురు స్టార్ హీరోల సినిమాలు బరిలోకి దిగాయి. స్టార్ హీరో అజిత్ తెగింపు 11వ తేదీన, బాలయ్య వీర సింహారెడ్డి 12వ తేదీన, విజయ్ దళపతి వారసుడు సినిమా 12వ తేదీన, చిరంజీవి వాల్తేరు వీరయ్య 13వ తేదీన థియేటర్స్ లో విడుదలయ్యాయి. బాలయ్య, చిరంజీవి సినిమాలు ఒకరోజు తేడాతోనే విడుదలయ్యాయి. ఈ నలుగురు స్టార్ హీరోలు కావడంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నాడు. అయితే బాలయ్య సినిమా గతంలో మాదిరిగానే రివేంజ్ స్టోరీ తో తెరకెక్కించారు.
వీర సింహారెడ్డి సినిమా సెకండ్ హాఫ్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఎక్కువ ఉండడంతో ప్రేక్షకులు కొంచెం బోరింగ్ గా ఫీల్ అయ్యారు. అయితే బాలయ్య అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చేసింది. వీర సింహారెడ్డి సినిమా మొత్తంలో ఎక్కువగా బాలయ్య కనిపిస్తారు. సినిమాలో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్న క్లైమాక్స్లో వరలక్ష్మి శరత్ కుమార్ తో ఉండే ఎమోషనల్ సీన్స్ బాగా ఉంటాయి. ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఇందులో మాస్ మహారాజా రవితేజ నటించడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ తన అంద చందాలతో మెస్మరైజ్ చేసింది.
అయితే చిరంజీవి గత రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ సినిమా కూడా పోతుందని కొందరు అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, రొమాన్స్ అన్ని ఉన్నాయి. దీంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బాలయ్య సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. చిరంజీవి సినిమా ప్రేక్షకులను అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేసింది. రెండు సినిమాలు బాగున్నప్పటికీ ఏ సినిమా ఎంత కలెక్షన్స్ సాధిస్తున్న కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. మొత్తానికి అయితే బాలకృష్ణ చిరంజీవి సినిమాలు ప్రేక్షకులను పండుగ సందర్భంగా ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.