Anchor Pradeep : తెలివి తక్కువ యాంకర్ ప్రదీప్.. అక్కడ, ఇక్కడ కూడా తనది ఉపయోగించుకోలేక పోతున్నాడు..!!
Anchor Pradeep : బుల్లి తెర సూపర్ స్టార్ అంటూ యాంకర్ ప్రదీప్ కి పేరు ఉంది అనడంలో సందేహం లేదు. సినిమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ప్రదీప్ బుల్లి తెర ద్వారా యాంకర్ గా సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది అన్నట్లుగా బుల్లి తెర వర్గాల్లో టాక్ ఉంది. ప్రేక్షకులు కూడా ఆయనను అంతగా అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. కానీ ప్రదీప్ తెలివి తక్కువ నిర్ణయాల వల్ల అద్భుతమైన కెరియర్ నాశనం అవుతుంది అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే యాంకర్ గా ఆయనకు మంచి పేరు ఉంది కనుక ఒకే సారి నాలుగైదు కార్యక్రమాలు చేసి భారీగా డబ్బు సంపాదించుకోవచ్చు.. కానీ ఆయన అలా చేయడం లేదు. ఒకటి రెండు ఎంపిక చేసుకొని మరి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇక యాంకర్ గా వచ్చిన పాపులారిటీతో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. సినిమా యావరేజ్ గా నడిచింది, అయినా కూడా ప్రదీప్ కి ఉన్న ఇమేజ్ కారణంగా పదుల సంఖ్యలో కథలు ఆయన వద్దకు వస్తున్నాయట. నిర్మాతలు అడ్వాన్స్ పట్టుకొని ఆయన ఇంటి ముందు క్యూ కట్టారట.
అయినా కూడా ప్రదీప్ ఇప్పటి వరకు కొత్త సినిమాకు సైన్ చేయలేదు. వరుసగా టీవీ షోలు చేయడం లేదు అలాగే సినిమాలకు కూడా కమిట్ అవ్వడం లేదు సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న యాంకర్ ప్రదీప్ అక్కడ ఇక్కడ తనకున్న ఇమేజ్ ని ఉపయోగించుకోలేక పోతున్నాడు అంటూ ఆయన అభిమానులు స్వయంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక నుండి అయిన యాంకర్ ప్రదీప్ హీరోగా బిజీ అవ్వాలని యాంకర్ గా మరింత బిజీ అవ్వాలని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నారు.