Sreemukhi : శ్రీముఖి పెళ్లి.. యాంకర్‌ ప్రదీప్ ఫ్యాన్స్ ఆగ్రహం

 Authored By prabhas | The Telugu News | Updated on :23 December 2022,12:40 pm

Sreemukhi : బుల్లి తెర లేడీ సూపర్ స్టార్ అంటూ శ్రీముఖి కి పేరు దక్కింది. బుల్లి తెర రాములమ్మ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుంది అంటూ కన్ఫామ్ అయ్యింది. ఈ ఏడాది వాలెంటెన్స్ డే సందర్భంగా తాను ప్రేమలో ఉన్నట్లుగా అధికారికంగా ప్రకటించిన శ్రీముఖి వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే వారికి పెళ్లి చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ ఆమె సన్నిహితుల నుండి సమాచారం అందుతుంది. శ్రీముఖి పెళ్లి చేసుకోబోతున్నది ఎవరిని అనే విషయమై క్లారిటీ రాలేదు కానీ ఆమె పెళ్లికి సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నాయి అంటూ మాత్రం క్లారిటీ వచ్చేసింది.

ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లలో మునిగి ఉన్నారని తెలుస్తుంది. 2023 సంవత్సరం ఆరంభంలోనే శ్రీముఖి వివాహం జరిగే అవకాశం ఉందని అంతా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో శ్రీముఖి యొక్క సహా యాంకర్ అయినా ప్రదీప్ పెళ్లి గురించి ప్రముఖంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రతి పెళ్లి గురించి గత కొన్ని నెలలుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఏ ఒక్క వార్త నిజం అవ్వలేదు. అసలు ప్రదీప్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనే విషయంలో క్లారిటీ లేదు. శ్రీముఖి పెళ్లి చేసుకోబోతున్న నేపద్యంలో యాంకర్ ప్రదీప్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అంటూ ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

anchor pradeep fans angry about Sreemukhi marriage

anchor pradeep fans angry about Sreemukhi marriage

యాంకర్ ప్రదీప్ పై ఆయన ఫాన్స్‌ స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెళ్లి గురించి ఇంకా నిర్ణయం తీసుకోకపోతే అది సరైన పద్ధతి కాదు అంటూ హెచ్చరిస్తున్నారు. ప్రదీప్ ఫ్యాన్స్ ఆయన నుండి సినిమాలు కూడా ఆశిస్తున్నారు, కానీ ఒక్క సినిమా హీరో గా చేసి మళ్ళీ సినిమా లో చేయడం లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత అయినా సినిమాలు చేస్తాడని అంత భావిస్తున్నారు. కానీ ఆయన ఇప్పటికి కూడా పెళ్లి ఆలోచన చేయడం లేదు. శ్రీముఖి పెళ్లి అయిన తర్వాత అయినా ప్రదీప్ పెళ్లి అవుతుందో లేదో అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి