Conductor Jhansi : గాజువాక ఆర్టీసీ డిపో కండక్టర్ ఝాన్సీ ఈ మధ్య కాలంలో ఈటీవీలో తెగ కనిపిస్తోంది. ఒకప్పుడు జాతరలో స్టేజ్ షో లు చేసుకున్నా ఝాన్సీ ఇప్పుడు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ పై ఒక రేంజ్ లో సత్తా చాటుతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో నటనతో ఆకట్టుకుంటే.. జబర్దస్త్ లో తాజాగా బుల్లెట్ భాస్కర్ టీం లో కనిపించి కమెడియన్ గా కూడా సత్తా చాటింది. కండక్టర్ ఝాన్సీ చేస్తున్న కామెడీ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ ఆమె డాన్స్ మూమెంట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం డాన్స్ మూమెంట్స్ మాత్రమే కాకుండా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఆమె స్థాయిని పెంచాయి అనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో ఈటీవీలో ఎక్కడ చూసినా కూడా కండక్టర్ ఝాన్సీ కనిపిస్తుంది. ఇలా ఈటీవీలో ఫేమస్ అయిన వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఇతర చానల్స్ లో కనిపించడం పరిపాటి. కానీ ఇప్పటి వరకు కండక్టర్ ఝాన్సీ ఈటీవీలో మాత్రమే కనిపిస్తోంది.
ఇప్పటి వరకు స్టార్ మా కానీ జీ తెలుగు కానీ ఇతర చానల్స్ నుండి ఆమెకు ఆహ్వానం అందినట్లుగా లేదు. ఒకవేళ ఆహ్వానం అందినా మల్లెమాల వారు అగ్రిమెంట్ ఏమైనా ఝాన్సీ తో చేయించుకున్నారేమో అంటూ ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా కండక్టర్ ఝాన్సీ ప్రస్తుతం ఈటీవీ కే పరిమితం ఇవ్వడంతో ఆమె టాలెంట్ కి తగిన గుర్తింపు పారితోషికం రావడం లేదు అనేది ఆమె అభిమానుల యొక్క అభిప్రాయం. స్టార్ మా ఇతర చానల్స్ నుండి ఆమెకు అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే ఆమెకు మంచి పారితోషికం దక్కుతుంది అనేది చాలా మంది యొక్క విశ్వాసం.
అందుకే ఆమెను ఒకసారి ఓంకార్ అన్నయ్య పట్టించుకోవాలని అంతా కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆహా ఓటీటీ లో డాన్స్ ఐకాన్ అనే డాన్స్ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసింది. యాంకర్ గా నిర్మాతగా ఓంకార్ వ్యవహరిస్తున్నాడు. కనుక ఆ కార్యక్రమంలో కండక్టర్ ఝాన్సీ కనిపిస్తే బాగుంటుందని అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో ఆమెకు అవకాశం లేకుంటే ఇలా ఓటీటీ కార్యక్రమంలో ఆమెకు అవకాశం ఉంటుందేమో చూడాలి. ఒక సారి ఓంకార్ అన్నయ్య చేతిలో పడితే ఆమె కచ్చితంగా మరింతగా పాపులారిటీని సొంతం చేసుకొని స్టార్ సెలబ్రిటీగా మారే అవకాశం ఉందంటూ బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కండక్టర్ ఝాన్సీ మన ఓంకార్ అన్నయ్య దృష్టిలో పడుతుందా లేదా అనేది చూడాలి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.