Conductor Jhansi : కండక్టర్‌ ఝాన్సీని తెగ వాడేస్తున్న మల్లెమాల… ఇంకా అక్కడ నుండి పిలుపు రాలేదా?

Authored By aruna | The Telugu News | Published on: September 27, 2022, 12:30 pm

Conductor Jhansi : గాజువాక ఆర్టీసీ డిపో కండక్టర్ ఝాన్సీ ఈ మధ్య కాలంలో ఈటీవీలో తెగ కనిపిస్తోంది. ఒకప్పుడు జాతరలో స్టేజ్ షో లు చేసుకున్నా ఝాన్సీ ఇప్పుడు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ పై ఒక రేంజ్ లో సత్తా చాటుతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో నటనతో ఆకట్టుకుంటే.. జబర్దస్త్ లో తాజాగా బుల్లెట్ భాస్కర్ టీం లో కనిపించి కమెడియన్ గా కూడా సత్తా చాటింది. కండక్టర్ ఝాన్సీ చేస్తున్న కామెడీ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ ఆమె డాన్స్ మూమెంట్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం డాన్స్ మూమెంట్స్ మాత్రమే కాకుండా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఆమె స్థాయిని పెంచాయి అనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో ఈటీవీలో ఎక్కడ చూసినా కూడా కండక్టర్ ఝాన్సీ కనిపిస్తుంది. ఇలా ఈటీవీలో ఫేమస్ అయిన వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఇతర చానల్స్ లో కనిపించడం పరిపాటి. కానీ ఇప్పటి వరకు కండక్టర్ ఝాన్సీ ఈటీవీలో మాత్రమే కనిపిస్తోంది.

ఇప్పటి వరకు స్టార్ మా కానీ జీ తెలుగు కానీ ఇతర చానల్స్ నుండి ఆమెకు ఆహ్వానం అందినట్లుగా లేదు. ఒకవేళ ఆహ్వానం అందినా మల్లెమాల వారు అగ్రిమెంట్ ఏమైనా ఝాన్సీ తో చేయించుకున్నారేమో అంటూ ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా కండక్టర్ ఝాన్సీ ప్రస్తుతం ఈటీవీ కే పరిమితం ఇవ్వడంతో ఆమె టాలెంట్ కి తగిన గుర్తింపు పారితోషికం రావడం లేదు అనేది ఆమె అభిమానుల యొక్క అభిప్రాయం. స్టార్ మా ఇతర చానల్స్ నుండి ఆమెకు అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే ఆమెకు మంచి పారితోషికం దక్కుతుంది అనేది చాలా మంది యొక్క విశ్వాసం.

why Conductor Jhansi not doing other channels programs

why Conductor Jhansi not doing other channels programs

అందుకే ఆమెను ఒకసారి ఓంకార్ అన్నయ్య పట్టించుకోవాలని అంతా కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆహా ఓటీటీ లో డాన్స్ ఐకాన్ అనే డాన్స్ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసింది. యాంకర్ గా నిర్మాతగా ఓంకార్ వ్యవహరిస్తున్నాడు. కనుక ఆ కార్యక్రమంలో కండక్టర్ ఝాన్సీ కనిపిస్తే బాగుంటుందని అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో ఆమెకు అవకాశం లేకుంటే ఇలా ఓటీటీ కార్యక్రమంలో ఆమెకు అవకాశం ఉంటుందేమో చూడాలి. ఒక సారి ఓంకార్ అన్నయ్య చేతిలో పడితే ఆమె కచ్చితంగా మరింతగా పాపులారిటీని సొంతం చేసుకొని స్టార్ సెలబ్రిటీగా మారే అవకాశం ఉందంటూ బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కండక్టర్ ఝాన్సీ మన ఓంకార్ అన్నయ్య దృష్టిలో పడుతుందా లేదా అనేది చూడాలి.

aruna

No bio available for this author.

  1. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  2. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  3. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  4. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  5. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  6. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  7. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp