Sampurna Web Series : శోభనం రోజే భార్యకు చుక్కలు చూపించిన భర్త.. ఓటిటిలో దూసుకెళ్తున్న సిరీస్..!
ప్రధానాంశాలు:
శోభనం రోజే భార్యకు చుక్కలు చూపించిన సైకో భర్త
ఓటిటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సిరీస్
Sampurna Web Series : శోభనం రోజే భార్యకు చుక్కలు చూపించిన భర్త.. ఓటిటిలో దూసుకెళ్తున్న సిరీస్..!
Sampurna Web Series : ప్రతి శుక్రవారం ఓటీటీలో OTT విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు Web Series ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలవుతున్నా, ఓటీటీ వేదికపై సినిమాలు, సిరీస్‌లకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా భిన్నమైన కథాంశాలతో వస్తున్న సిరీస్‌లు ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్నాయి. తాజాగా ఓ బెంగాలీ సిరీస్ ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సామాజిక సమస్యలపై చర్చకు దారితీస్తూ, స్త్రీల హక్కులను ప్రాధాన్యతతో చూపిస్తూ రూపొందిన ఈ సిరీస్ పేరు “సంపూర్ణ”.

Sampurna Web Series : శోభనం రోజే భార్యకు చుక్కలు చూపించిన భర్త.. ఓటిటిలో దూసుకెళ్తున్న సిరీస్..!
Sampurna Web Series : ఓటిటిలో అదరగొడుతున్న సైకో భర్త సిరీస్
ఈ సిరీస్ కథ నందిని అనే యువతిపై కేంద్రీకృతమైంది. ఆమె పెళ్లైన రోజు నుంచే భర్త నుంచి తీవ్ర మనస్తాపానికి లోనవుతుంది. మొదటి రాత్రినుంచే భర్త ఆమెపై దౌర్జన్యానికి పాల్పడటం ప్రారంభిస్తాడు. భర్త ప్రవర్తన సైకోలా ఉండటం ఆమెను లోపలితో పాటు బయటకూ నెగిటివ్‌గా మార్చేస్తుంది. ఈ విషయం గురించి అత్తగారికి, మామగారికి చెప్పాలన్నా పరిస్థితులు అనుకూలంగా ఉండవు. దీంతో నందినికి మానసికంగా తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. ఇలాంటి సమయంలో ఆమెతో పాటు ఉండే కోడలు సంపూర్ణ ఆమెకు ధైర్యం చెప్పి, న్యాయపోరాటంలో తోడ్పడుతుంది.
“సంపూర్ణ” సిరీస్‌లో సోహిని సర్కార్, రజనందిని పాల్, లబోని సర్కార్, అనుభవ్ కంజిలాల్, ప్రాంతిక్ బెనర్జీ, రజత్ గంగూలీ ముఖ్య పాత్రల్లో నటించారు. IMDb రేటింగ్ 6.8/10 సాధించిన ఈ సిరీస్ హోయిచోయ్ అనే బెంగాలీ ఓటీటీ ప్లాట్‌ఫారంలో అందుబాటులో ఉంది. గృహ హింస, స్త్రీల సమస్యల పట్ల సమాజాన్ని చైతన్యపరిచేలా రూపొందిన ఈ సిరీస్ గమనార్హం. కథనం, నటన, సామాజిక సందేశం ఇలా అన్ని కోణాల్లోనూ ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది