Hanuman vs Guntur kaaram : మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్ షాక్.. హనుమాన్ ఊచకోత బాబోయ్..!
ప్రధానాంశాలు:
Hanuman vs Guntur kaaram : మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్ షాక్.. హనుమాన్ ఊచకోత బాబోయ్..!
Hanuman vs Guntur kaaram : తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ హనుమాన్ ‘ సినిమా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. భారీ వసూళ్లతో దూసుకెళుతున్న ఈ సినిమాకి పలుచోట్ల టికెట్లు దొరకటం కూడా కష్టంగా మారింది. విడుదలకు ముందు ఈ సినిమాకి థియేటర్లు కూడా చాలా తక్కువగా దక్కాయి. ఎందుకంటే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా, హనుమాన్ ఒకే రోజు విడుదలయ్యాయి. దీంతో హనుమాన్ కి తక్కువ థియేటర్లు లభించాయి. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో హనుమాన్ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాకి టికెట్లు దొరకటం చాలా కష్టంగా మారింది. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు నార్త్ లో కూడా టికెట్లు దొరకటం లేదు.
ఓవర్సీస్ లో, నార్త్ అమెరికాలో టికెట్లు దొరకటం లేదు. అన్ని చోట్ల హనుమాన్ సినిమాకి టికెట్లు దొరకని పరిస్థితి. మిగతా సినిమాలు గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ సినిమాలకి తేలికగా టికెట్లు దొరుకుతున్నాయి. కానీ హనుమాన్ కి మాత్రం దొరకటం కష్టంగా ఉంది. ఓవర్సీస్ లో త్రిబుల్ ఆర్, బాహుబలి సినిమా రికార్డ్స్ ను కూడా హనుమాన్ బ్రేక్ చేసింది. ఈ సంవత్సరం టాప్ టెన్ సినిమాలలో హనుమాన్ సినిమా పేరు సంపాదించుకుంది. రోజు రోజుకి హనుమాన్ సినిమా కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. గుంటూరు కారం సినిమాకి ఎక్కువ షోలు దక్కిన హౌస్ ఫుల్ కావడం లేదు. కానీ హనుమాన్ సినిమాకి హౌస్ ఫుల్ అవ్వడంతో పాటు టికెట్లు దొరకటం కష్టంగా ఉంది. దీంతో హనుమాన్ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో తెలిసిపోతుంది.
హనుమాన్ సినిమా దెబ్బకి గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ సినిమాలు పడిపోయాయి. అవి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లపరంగా హనుమాన్ సినిమా కంటే తక్కువ కలెక్షన్స్ రాబడుతున్నాయి. నార్త్ లో సౌత్ లో హనుమాన్ సినిమా ప్రభంజనం సృష్టిస్తుంది. చిన్న సినిమా అయినప్పటికీ హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. గుంటూరు కారం సినిమాకి 430 థియేటర్లు దక్కితే ఒకటి కూడా హౌస్ ఫుల్ కాలేదు. కానీ హనుమాన్ సినిమాకి కేవలం 230 థియేటర్లు దక్కిన హౌస్ ఫుల్ అవుతున్నాయి. టికెట్లు దొరకడం కష్టంగా మారింది. దీన్ని బట్టి హనుమాన్ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. హనుమాన్ దెబ్బకి గుంటూరు కారం సినిమా గ్రాఫ్ పడిపోయింది. ఇది మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్ షాక్ అని చెప్పాలి.
