
why negativity spread on Bigg Boss 6 Telugu
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 6 రెండు రోజుల క్రితమే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి 5వ సీజన్ వరకు.. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఓటీటీ సీజన్ వచ్చింది. ఓటీటీతో 24 గంటలు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో అందరూ చూశారు. ఆ తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 వచ్చేసింది. ఇది కూడా 24 గంటలు స్ట్రీమింగ్ అవుతుంది కానీ.. స్టార్ మా చానెల్ లో రోజూ ఓ గంట ప్రసారం అవుతుంది. బిగ్ బాస్ రియాల్టీ షోకు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫాలోయింగ్ ఉంది. కొందరు బిగ్ బాస్ షోకు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. మరికొందరు మాత్రం బిగ్ బాస్ షోపై మండిపడుతున్నారు.
ఈ షోతో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ కొందరు సామాజిక వేత్తలు మండిపడుతున్నారు. కొందరు కంటెస్టెంట్ల జీవితాన్ని కూడా బిగ్ బాస్ మార్చేస్తోంది. కొందరికి పాజిటివ్ గా అయితే మరికొందరికి నెగెటివ్ గా. ఏది ఏమైనా.. 100 రోజులు ఒకే ఇంట్లో.. కొత్త వ్యక్తుల మధ్య ఉండటం.. అది కూడా చుట్టూ కెమెరాలు ఉంటే.. మనకు మనం ఎలా ఉంటాం అనేది నిజంగానే ఆసక్తికరమైన కాన్సెప్టే కానీ.. ఇటువంటి షోల వల్ల జనాలకు వచ్చే ఉపయోగం ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఇటీవల స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 6 లో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు. అందులో పెళ్లయిన వాళ్లు చాలా తక్కువ మిగితా వాళ్లంతా యువతులే. 20 ఏళ్ల లోపు వారే.
why negativity spread on Bigg Boss 6 Telugu
వాళ్లు హౌస్ లోపల చెడ్డీలు, మిడ్డీలు వేసుకొని తిరుగుతూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ బిగ్ బాస్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. మరోవైపు సీపీఐ నారాయణ కూడా బిగ్ బాస్ షోపై స్పందించారు. ఇది ఒక పనికిమాలిన షో.. అందులో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ అందరూ కోతులు. ఆ షోను చూసే వాళ్లు కూడా కోతులే.. అంటూ నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజానికి.. నారాయణ ఇప్పుడే కాదు.. గతంలో వచ్చిన అన్ని బిగ్ బాస్ సీజన్లపైనా ఇలాగే స్పందించారు. ఇప్పుడు మరోసారి అలాంటి కామెంట్సే చేశారు. అసలు అది బిగ్ బాస్ హౌస్ కాదు.. బ్రోతల్ హౌస్ అంటూ సీపీఐ నారాయణ కాస్త ఘాటుగానే స్పందించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై బిగ్ బాస్ యాజమాన్యం కానీ.. హోస్ట్ నాగార్జున కానీ స్పందిస్తారేమో వేచి చూడాల్సిందే.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.