Janaki Kalaganaledu : జానకి, రామాను జ్ఞానాంబ క్షమిస్తుందా? శ్రీరామనవమి వేడుకల్లో అందరూ పాల్గొంటారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu : జానకి, రామాను జ్ఞానాంబ క్షమిస్తుందా? శ్రీరామనవమి వేడుకల్లో అందరూ పాల్గొంటారా?

 Authored By gatla | The Telugu News | Updated on :17 April 2022,11:30 am

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు 18 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 281 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామా గారు ఈ అపార్థాలన్నీ త్వరలోనే తొలగిపోతాయి. అత్తయ్య గారు మనల్ని త్వరలోనే అర్థం చేసుకుంటారు. మీరు ఇప్పుడు వచ్చిన కష్టం గురించి ఆలోచించకండి. రేపటి రోజున మనకు రాబోయే సంతోషం గురించి ఆలోచించండి. మనసులో ఎలాంటి దిగులు పెట్టుకోకుండా పడుకోండి అని రామాకు సర్దిచెబుతుంది జానకి.

will jnanamba allow janaki and rama to come with them to temple

will jnanamba allow janaki and rama to come with them to temple

కట్ చేస్తే తెల్లారుతుంది. శ్రీరామనవమి వేడుకలకు జ్ఞానాంబ కుటుంబాన్ని ఆహ్వానించడానికి వస్తారు పూజారులు. మీ పెద్దబ్బాయి రామచంద్రుడు వివాహం జరిగిన తర్వాత వస్తున్న మొదటి శ్రీరామనవమి. అందుకని పెద్ద కొడుకు, పెద్దకోడలు చేతుల మీదుగా అన్నదానం, చిన్నకొడుకు, చిన్నకోడలు చేతుల మీదుగా వస్త్రదానం చేపిస్తే మంచిది అంటాడు పూజారి. దీంతో మల్లిక మధ్యలో కల్పించుకుంటుంది. మీరు చెప్పినట్టే జరిపిద్దాం అంటాడు గోవిందరాజు. మీ పెద్దకొడుకు, పెద్దకోడలు పేర్లు కూడా జానకిరాములే. ఆ జానకిరాముల కళ్యాణాన్ని.. ఈ జానకిరాముల చేతుల మీదుగా జరిపిస్తే శుభదాయకంగా ఉంటుంది అంటాడు పూజారి.

మళ్లీ మల్లిక ఏదో మాట్లాడబోతుంది. దీంతో మల్లికను వారిస్తాడు గోవిందరాజు. పూజారి వాళ్లు వెళ్లిపోయాక గోవిందరాజు.. జ్ఞానాంబకు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తాడు కానీ.. జ్ఞానాంబ అస్సలు పట్టించుకోదు. ఎంత చెప్పినా.. జానకి, రామా గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి స్వీటు కొట్టుకు వెళ్లిపోతుంది.

స్వీటు కొట్టులో కూడా జ్ఞానాంబ.. రామా, జానకి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నీలావతి వస్తుంది. నా మనవడికి బాద్ షా కావాలని ఒకటే ఏడుస్తున్నాడు. ఒక అరకేజి ఇస్తావా అని అడుగుతుంది. దీంతో సరే.. ఇస్తాను ఉండు అని ఇస్తుంటుంది.

Janaki Kalaganaledu : నీలావతిని ఉసిగొల్పిన మల్లిక

ఇంతలో మల్లిక వస్తుంది. టిఫిన్ కూడా చేయకుండా వచ్చేశారు కదా. మీకోసం టిఫిన్ పట్టుకొచ్చాను తినండి అంటుంది. దీంతో అక్కడ పెట్టు అంటుంది జ్ఞానాంబ. నీలావతిని చూసి.. మళ్లీ అగ్నికి ఆజ్యం పోస్తుంది మల్లిక. జానకి విషయం గురించి నీలావతితో మాట్లాడటంతో కోప్పడుతుంది జ్ఞానాంబ.

నీలావతిని వెళ్లమని… ఆ తర్వాత మన ఫ్యామిలీ విషయాలు వేరే వాళ్ల ముందు ఇంకోసారి మాట్లాడుకు అని వార్నింగ్ ఇస్తుంది జ్ఞానాంబ. మరోవైపు జ్ఞానాంబ, గోవిందరాజు, విష్ణు, మల్లిక, అఖిల్, వెన్నెల బైక్ మీద గుడికి వెళ్తుండగా.. రామా, జానకి మాత్రం సైకిల్ మీద వెళ్తుంటారు.

వాళ్లను చూసిన రామా.. గత సంవత్సరం జరిగిన శ్రీరామనవమి వేడుకలను గుర్తు తెచ్చుకుంటాడు. ఆ తర్వాత రామా, జానకి గుడికి వెళ్తారు. ఇంతలో అప్పటికే అక్కడి వచ్చిన జ్ఞానాంబ వాళ్లను చూస్తుంది. ఆ తర్వాత చెప్పులు విప్పే దగ్గర తన కాళ్లు మొక్కబోతాడు రామా. కానీ.. జ్ఞానాంబ దూరం జరుగుతుంది.

ఆ భరతుడు అన్నయ్య రాముడు చెప్పులను సింహాసనం మీద పెట్టి రాజ్యం ఏలాడట. ఆ రూపంలో అన్నయ్య ఆశీర్వాదం పొందాడట. నేను కూడా ఈ రూపంలో మా అమ్మ ఆశీర్వాదం పొందుతాను అని అనుకుంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది