Janaki Kalaganaledu : వెన్నెల ప్రేమను జ్ఞానాంబ ఒప్పుకుంటుందా? జానకి, రామా ఒప్పిస్తారా? లేక దిలీప్ ను ఇచ్చి వెన్నెలకు పెళ్లి చేస్తారా?
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఫిబ్రవరి 2022, 14వ తేదీ ఎపిసోడ్ 236 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకిని పదే పదే.. ఆ విషయం గురించే అడిగి విసిగిస్తుంటాడు రామా. దీంతో నా ఐపీఎస్ ఇష్టాన్ని నేనే వదిలేశాను. ఇక మీరు ఆలోచించకండి అని ఖరాఖండిగా చెప్పేస్తుంది జానకి. వదిలేశాను అని నా కళ్లలోకి చూసి ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నిస్తాడు రామా. ఆ ప్రస్తావనను వదిలేద్దామని ఎంత చెప్పినా మీరు వినిపించుకోరు ఏంటి అంటుంది జానకి. గుడిలో ఒట్టు పెట్టి మరీ నాకు చెప్పబోయారు కదా. అప్పుడు చెప్పబోయిన విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదు. ఇంతలోనే ఏం జరిగింది అని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తాడు రామా. దీంతో జానకికి ఏం చేయాలో అర్థం కాదు.
మరోవైపు వెన్నెల, దిలీప్ చనిపోవడం కోసం పెద్ద కొండ ఎక్కుతారు. చనిపోయే ముందు ఒకసారి జానకికి ఫోన్ చేస్తుంది వెన్నెల. నా వల్ల నువ్వు చాలా కష్టపడ్డావు. చాలా సమస్యలు ఎదుర్కొన్నావు. సారీ వదిన అంటుంది వెన్నెల. అయినా ఇప్పుడు అవన్నీ విషయాలు ఎందుకు.. అని అంటుంది జానకి. దీంతో ఇక నేను ఉండను కదా వదిన అంటుంది వెన్నెల. దీంతో జానకి షాక్ అవుతుంది. ఏమైంది వెన్నల అలా మాట్లాడుతున్నావు ఎందుకు. నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతంది. వెంటనే ఫోన్ తీసుకొని ఏమైంది వెన్నెల.. ఎక్కడున్నావు చెప్పు అని అడుగుతాడు రామా. దీంతో తన ప్రేమ గురించి చెబుతుంది వెన్నెల. ఇప్పుడు ఇది ఎవరి చేతుల్లో లేదు. ఇప్పటికే అమ్మ నిశ్చితార్థం కూడా ఫిక్స్ చేసి ఉంటుంది. దిలీప్ లేకుండ నేను బతకలేను అంటుంది వెన్నెల. వెంటనే ఫోన్ కట్ చేస్తుంది.
మళ్లీ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే.. తను ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు శంఖం శబ్దం వినిపించడంతో.. తను ఏదైనా శివాలయంలో ఉందేమో అనుకొని వెతకడానికి ప్రయత్నిస్తారు. చివరకు ఓ కొండ దగ్గర వాళ్లు కనిపిస్తారు. వెన్నెల, దిలీప్ ఇద్దరూ చనిపోయేందుకు కొండ మీది నుంచి దూకేందుకు సిద్ధం కాగా.. వెంటనే జానకి, రామా వచ్చి వాళ్లను దూకకుండా కాపాడుతారు.
Janaki Kalaganaledu : వెన్నెలకు రామచంద్రాపురం సంబంధాన్ని ఖాయం చేసిన జ్ఞానాంబ, గోవిందరాజు
వదిన మమ్మల్ని ఎందుకు కాపాడారు. మమ్మల్ని చనిపోనివ్వండి అంటుంది వెన్నెల. నీకేమైనా పిచ్చా. నీకేమైనా అయితే మీ అమ్మగారు తట్టుకొని బతకగలరా? ప్రాణాలు తీసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు వీళ్లెవరూ నీకు గుర్తుకురాలేదా అని అడుగుతుంది జానకి.
తెలుసు వదిన. అమ్మకు నేనంటే ఎంత ప్రేమో.. అన్నయ్యకు నేనంటే ఎంత ప్రాణమో. ఈ ఆలోచన చేసేముందు అందరినీ గుర్తు చేసుకొని నాలో నేను ఎంత ఏడ్చానో నాకే తెలుసు. కానీ.. దిలీప్ లేకుండా నేను బతకలేను వదిన. ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం ఏడుస్తూ బతకలేను. అందుకే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవాలని అనుకున్నాను అంటుంది వెన్నెల.
నా ప్రేమను ఎవ్వరూ ఒప్పుకోరు. మా పెళ్లికి అంగీకరించరు అంటుంది వెన్నెల. ఎందుకు ఒప్పుకుంటారు.. అంటుంది జానకి. పిల్లల భవిష్యత్తు కోసం వాళ్లకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. పిల్లలకు ఏమిస్తే సంతోషంగా ఉంటారో తెలిసిన తల్లిదండ్రులకు ఎలాంటి వాడిని ఇచ్చి చేస్తే వాళ్లు సంతోషంగా ఉంటారో వాళ్లకు తెలియదా అని అంటుంది జానకి.
అది మీమీద ప్రేమే తప్ప. మీ ప్రేమ మీద ద్వేషం కాదమ్మా. పదా.. ఇంటికి వెళ్దాం అంటుంది జానకి. అది కాదు వదిన. ఎల్లుండి నా నిశ్చితార్థం అంటుంది వెన్నెల. నా మాట మీద నమ్మకం ఉంచి ఇంటికి రా అంటుంది జానకి. నువ్వు ఇంటికి వెళ్లు దిలీప్. నేను వెళ్లాక ఫోన్ చేస్తాను అంటాడు రామా.
మరోవైపు రామచంద్రాపురం వెళ్లి వెన్నెలకు నిశ్చితార్థం ముహూర్తం పెడతారు జ్ఞానాంబ, గోవిందరాజు. రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెబుతాడు పంతులు. మరీ రెండు రోజులు అంటే ఏర్పాట్లు అవీ చేయడం కష్టమేమో అని అనుకుంటారు. కానీ.. తర్వాత అందరూ ఒప్పుకుంటారు.
అమ్మ నిర్ణయాన్ని ఎదురించడం అంటే అంటుంది వెన్నెల. కానీ.. జ్ఞానాంబ మాత్రం మాకు పరువు ముఖ్యం.. ప్రాణాలు ముఖ్యం కాదు అని రామచంద్రాపురం పెళ్లి వాళ్లతో అంటుంది. ప్రాణాల కన్నా పరువే ముఖ్యం అంటుంది. ప్రాణం పోయే పరిస్థితి వస్తే ప్రాణాలు వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని జ్ఞానాంబ వాళ్లతో అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.