Intinti Gruhalakshmi : తులసి చాలెంజ్ లో సామ్రాట్ గెలుస్తాడా? లాస్యకు షాకిచ్చిన అంకిత, శృతి.. ఇంతలో పరందామయ్య షాకింగ్ నిర్ణయం

Authored By Varun G | The Telugu News | Published on: December 4, 2022, 9:30 am

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 5 డిసెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 806 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసికి జీతం రావడంతో ఎలా ఖర్చు పెట్టాలో.. ఎంత ఆదా చేయాలో ఆలోచిస్తుంటుంది. సామ్రాట్ మాత్రం.. మీరు ఖర్చులు పోను.. మీకు వచ్చిన జీతానికి ఐదారు వేల కంటే ఎక్కువ మిగలదు అంటాడు. దీంతో లేదు.. నేను లెక్క వేస్తా అని చెప్పి 20 వేల వరకు మిగులుతాయి అంటుంది తులసి. దీంతో సామ్రాట్ షాక్ అవుతాడు. మధ్య తరగతి ప్రజలు.. అన్ని విషయాల్లో ఖర్చు పెట్టాలంటే కుదరదు. కొన్ని పనులు తామే స్వయంగా చేసుకోవాలంటుంది.

will samrat win in tulasi challenge

will samrat win in tulasi challenge

దీంతో నేను కూడా ఒకరోజు మధ్యతరగతి యువకుడిగా ఉంటా అంటాడు సామ్రాట్. నేను షాపింగ్ చేయాలి. షాపింగ్ కు వెళ్లాలి అంటుంది తులసి. దీంతో నేను కూడా వస్తా అంటాడు సామ్రాట్. మీరు వస్తే ఓకే కానీ.. నేను బస్సులో వెళ్తా అంటుంది. దీంతో నేను కూడా బస్సులో వస్తా అంటాడు సామ్రాట్. ఇద్దరూ కలిసి బస్ స్టాప్ కు వెళ్తారు కానీ.. బస్సు ఎక్కలేకపోతాడు సామ్రాట్. దీంతో బస్సు ఎలా ఎక్కాలో చెబుతుంది తులసి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బస్సు ఎక్కుతారు.

Intinti Gruhalakshmi : పరందామయ్యను పలకరించడానికి వచ్చిన భాగ్య

మరోవైపు లాస్యను ఒక ఆట ఆడుకుంటారు అంకిత, శృతి. ఇద్దరూ కలిసి ఒక ఆట ఆడుకుంటారు. ఈరోజు నేను వంట చేస్తా అందరికీ అంటుంది లాస్య. దీంతో సరే మీ ఇష్టం చేసుకోండి కానీ.. ఈ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో వంట చేయాలి అని చెప్పేసరికి లాస్యకు ఏం చేయాలో అర్థం కాదు.

అంతమందికి అన్ని రకాల వంటలు చేయడం నా వల్ల కాదు. నేను వండిందే అందరూ తినాలి అంటుంది. దీంతో సరే.. మీరు ఏది వండితే అదే తింటాం. లేకపోతే మీరు మళ్లీ మీ ఇంట్లో నుంచి పంపించేస్తారు కదా. అసలు ఇది మీ ఇల్లు కదా. మీరే యజమాని కదా అంటారు శృతి, అంకిత.

ఇంతలో భాగ్య వచ్చి లాస్యను సేవ్ చేస్తుంది. అయినా ఈ ఇంట్లో నేను చేయడానికి చాలా పనులు ఉన్నాయి. మీరు వంట పని చూసుకోండి అని వంటను తప్పించుకొని వెళ్తుంది లాస్య. ఇంతలో భాగ్య వెళ్లి పరందామయ్యను కలుస్తుంది. బాగున్నారా మామయ్య అంటుంది.

దీంతో ఇప్పటి వరకు బాగానే ఉన్నా అంటాడు పరందామయ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp