Shruti Haasan : మూడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత శృతిహాసన్ క్రాక్ ,సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకుంది. కేవలం శృతిహాసన్ కు , మాత్రమే కాదు స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ కు కూడా ఈ సినిమా మంచి హిట్ ను అందించింది. ఇక ఈ సినిమా కరోనా కష్టకాలంలో అనూహ్యంగా విడుదలై భారీ కలెక్షన్స్ ను అందించింది. అంతేకాదు హీరో రవితేజ నటించిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా క్రాక్ రికార్డు నమోదు చేసింది. అయితే అప్పటివరకు ప్లాప్ లను చవిచూసిన హీరో రవితేజ, హీరోయిన్ శృతిహాసన్ కు ఈ సినిమా తిరిగి ఊపిరి పోసిందని చెప్పాలి.
క్రాక్ సినిమా తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేని నందమూరి బాలకృష్ణను హీరోగా పెట్టి వీర సింహారెడ్డి అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అఖండ సినిమా తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా ఇదే. అయితే డైరెక్టర్ గోపీచంద్ శృతిహాసన్ కు మళ్ళీ ఛాన్స్ ఇచ్చారట. బాలయ్య పక్కన హీరోయిన్ గా నటించే అవకాశంను గోపీచంద్ శృతిహాసన్ కి ఇచ్చాడు. అలాగే యంగ్ డైరెక్టర్ బాబి చిరంజీవిని హీరోగా పెట్టి నిర్మిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలోని శృతిహాసన్ నటిస్తోంది.
అయితే క్రాక్ లాంటి మంచి కమర్షియల్ హిట్ అందుకున్న తర్వాత, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి వారితో సినిమాలు చేస్తే కెరియర్ బాగుంటుంది కానీ , సీనియర్ హీరోలైన బాలయ్య చీరు లతో సినిమాలు చేస్తే ఇక కెరియర్ ముగిసినట్లే అని చాలామంది అంటున్నారు. ఇక ఇప్పటికే భారీ బడ్జెట్ తో ప్రశాంత్ నిల్ తరాకెక్కిస్తున్న సలార్ సినిమా లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది శృతిహాసన్. ఇక ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో , శృతిహాసన్ కి ఇదొక మలుపురాయని చెప్పవచ్చు. మరి కెరీర్ మలుపు తిరిగే టైం లో శృతిహాసన్ చిరంజీవి , బాలయ్య సరసన నటించడం మైనస్ అని చెప్పాలి. మరి ఈ సినిమాలు అమ్మడుకు ఎలా కలిసి వస్తాయో వేచి చూడాలి.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.