Shruti Haasan : ఆ ఇద్దరు సీనియర్ హీరోల వలన శృతిహాసన్ కెరియర్ కు బ్రేక్ పడుతుందా…? అడ్డంగా బుక్ చేశారుగా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shruti Haasan : ఆ ఇద్దరు సీనియర్ హీరోల వలన శృతిహాసన్ కెరియర్ కు బ్రేక్ పడుతుందా…? అడ్డంగా బుక్ చేశారుగా…!

Shruti Haasan : మూడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత శృతిహాసన్ క్రాక్ ,సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకుంది. కేవలం శృతిహాసన్ కు , మాత్రమే కాదు స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ కు కూడా ఈ సినిమా మంచి హిట్ ను అందించింది. ఇక ఈ సినిమా కరోనా కష్టకాలంలో అనూహ్యంగా విడుదలై భారీ కలెక్షన్స్ ను అందించింది. అంతేకాదు హీరో రవితేజ నటించిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 November 2022,7:00 pm

Shruti Haasan : మూడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత శృతిహాసన్ క్రాక్ ,సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకుంది. కేవలం శృతిహాసన్ కు , మాత్రమే కాదు స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ కు కూడా ఈ సినిమా మంచి హిట్ ను అందించింది. ఇక ఈ సినిమా కరోనా కష్టకాలంలో అనూహ్యంగా విడుదలై భారీ కలెక్షన్స్ ను అందించింది. అంతేకాదు హీరో రవితేజ నటించిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా క్రాక్ రికార్డు నమోదు చేసింది. అయితే అప్పటివరకు ప్లాప్ లను చవిచూసిన హీరో రవితేజ, హీరోయిన్ శృతిహాసన్ కు ఈ సినిమా తిరిగి ఊపిరి పోసిందని చెప్పాలి.

క్రాక్ సినిమా తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేని నందమూరి బాలకృష్ణను హీరోగా పెట్టి వీర సింహారెడ్డి అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అఖండ సినిమా తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా ఇదే. అయితే డైరెక్టర్ గోపీచంద్ శృతిహాసన్ కు మళ్ళీ ఛాన్స్ ఇచ్చారట. బాలయ్య పక్కన హీరోయిన్ గా నటించే అవకాశంను గోపీచంద్ శృతిహాసన్ కి ఇచ్చాడు. అలాగే యంగ్ డైరెక్టర్ బాబి చిరంజీవిని హీరోగా పెట్టి నిర్మిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలోని శృతిహాసన్ నటిస్తోంది.

Will Shruti Haasan career break because of those two senior heroes

Will Shruti Haasan career break because of those two senior heroes

అయితే క్రాక్ లాంటి మంచి కమర్షియల్ హిట్ అందుకున్న తర్వాత, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి వారితో సినిమాలు చేస్తే కెరియర్ బాగుంటుంది కానీ , సీనియర్ హీరోలైన బాలయ్య చీరు లతో సినిమాలు చేస్తే ఇక కెరియర్ ముగిసినట్లే అని చాలామంది అంటున్నారు. ఇక ఇప్పటికే భారీ బడ్జెట్ తో ప్రశాంత్ నిల్ తరాకెక్కిస్తున్న సలార్ సినిమా లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది శృతిహాసన్. ఇక ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో , శృతిహాసన్ కి ఇదొక మలుపురాయని చెప్పవచ్చు. మరి కెరీర్ మలుపు తిరిగే టైం లో శృతిహాసన్ చిరంజీవి , బాలయ్య సరసన నటించడం మైనస్ అని చెప్పాలి. మరి ఈ సినిమాలు అమ్మడుకు ఎలా కలిసి వస్తాయో వేచి చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది