will tulasi catches ranjith who cheated her in intinti gruhalakshmi
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 4 జులై 2022, ఎపిసోడ్ 675 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎలాగైనా తులసి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వాళ్ల మీద ప్రేమ నటిస్తూ అక్కడికి వచ్చి చేరుతుంది భాగ్య. తను రావడంతో తులసి ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది. ఒక రెండు రోజులు ఇక్కడే ఉండి అత్తయ్య, మామయ్యను చూసుకుంటా అంటూ నాటకాలు ఆడుతుంది భాగ్య. కానీ.. తనకు తెలియనిది ఏంటంటే.. తను, లాస్య.. తులసి బుట్టలో పడిపోయారని. మరోవైపు పరందామయ్య, అనసూయ.. భాగ్యపై విరుచుకుపడతారు. కానీ.. తనను ఉండనివ్వండి.. ఎంతైనా మీ కోడలే కదా అని తులసి చెప్పడంతో తనను రెండు రోజులు ఉండేందుకు ఓకే చెబుతారు.
will tulasi catches ranjith who cheated her in intinti gruhalakshmi
ఇక.. తులసి, దివ్య, అంకిత.. ముగ్గురూ తమ ప్లాన్ ను అమలు చేస్తారు. ఎవరో ఫోన్ చేసినట్టుగా తులసి మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. ఆ రంజిత్ గాడి అడ్రస్ దొరికిందా.. వాడిని పట్టుకొని లాక్కొని నా దగ్గరికి తీసుకురా.. అని చెబుతుంది. వాడి అడ్రస్ ఇదేనా అంటూ బయటికి మాట్లాడుతుంది. రంజిత్ గురించి మాట్లాడుతుండటంతో చాటుగా విని.. ఆ అడ్రస్ ను రాసుకుంటుంది భాగ్య. ఆ తర్వాత వెంటనే లాస్యకు ఫోన్ చేసి.. ఆ రంజిత్ గాడి అడ్రస్ తులసికి తెలిసిపోయింది. ఇంకాసేపట్లో వాడిని తులసి మనుషులు తన దగ్గరికి లాక్కొస్తారట. ఒకవేళ రంజిత్ గాడు దొరికితే.. మన బండారం బయటపడ్డట్టే. ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతుంది భాగ్య.
వెంటనే రంజిత్ ఉన్న అడ్రస్ కు మనం వెళ్లి అక్కడి నుంచి వాడిని తప్పిద్దాం అని లాస్య భాగ్యతో అంటుంది. ఇద్దరూ స్కూటీ మీద వెళ్తుంటారు. ఇంతలో స్కూటీ ఆగిపోతుంది. ఇలా జరిగిందేంటి అని అనుకుంటారు. స్కూటీ అస్సలు స్టార్ట్ అవ్వదు. మరోవైపు.. తులసి, దివ్య, అంకిత.. ముగ్గురూ.. లాస్య, భాగ్యను వెనుక ఆటోలో ఫాలో అవుతూ ఉంటారు.
కట్ చేస్తే.. స్కూటీని అక్కడే వదిలేసి..పరుగు లంఖించుకుంటారు లాస్య, భాగ్య. పరిగెత్తుకుంటూ ఆ రంజిత్ ఉన్నాడన్న అడ్రస్ కు వెళ్తారు. లోపలికి వెళ్లి చూడగా.. అక్కడ తులసి, అంకిత, దివ్య కనిపిస్తారు. వాళ్లను చూసి లాస్య, భాగ్య షాక్ అవుతారు.
రంజిత్ ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. జరిగిన కథ అంతా పూస గుచ్చినట్టు చెప్పేశాడు అని లాస్యను కంగారు పెడుతుంది తులసి. మీ నందు ముందు ఈ తులసి నోరు విప్పకుండా ఉండాలంటే.. 24 గంటల్లోపు నా అకౌంట్ లో 20 లక్షలు ఉండాలి అని చెబుతుంది తులసి. దీంతో లాస్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
This website uses cookies.