Intinti Gruhalakshmi : శశికలకు తులసి 80 లక్షలు కడుతుందా? లేక ఇంటిని శశికల స్వాధీనం చేసుకుంటుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi : శశికలకు తులసి 80 లక్షలు కడుతుందా? లేక ఇంటిని శశికల స్వాధీనం చేసుకుంటుందా?

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 14 ఫిబ్రవరి 2022, 555 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శశికళ వచ్చి తీసుకున్న అప్పు ఎప్పుడు తీర్చుతారంటూ తులసిని అడుగుతుంది. మూడు నెలల్లో ఇస్తా అన్నారు ఇప్పుడు సంవత్సరం అయింది.. ఇప్పటి వరకు అప్పు తీర్చలేదు. తీసుకున్న 20 లక్షలకు వడ్డీతో సహా 80 లక్షలు అయిందని.. వెంటనే 80 లక్షలు కట్టాలని లేకపోతే […]

 Authored By gatla | The Telugu News | Updated on :13 February 2022,9:30 am

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 14 ఫిబ్రవరి 2022, 555 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శశికళ వచ్చి తీసుకున్న అప్పు ఎప్పుడు తీర్చుతారంటూ తులసిని అడుగుతుంది. మూడు నెలల్లో ఇస్తా అన్నారు ఇప్పుడు సంవత్సరం అయింది.. ఇప్పటి వరకు అప్పు తీర్చలేదు. తీసుకున్న 20 లక్షలకు వడ్డీతో సహా 80 లక్షలు అయిందని.. వెంటనే 80 లక్షలు కట్టాలని లేకపోతే ఇల్లును స్వాధీనం చేసుకుంటా అని.. ఇంటి ముందు నా బోర్డు పెట్టుకుంటా అని తులసికి శశికళ వార్నింగ్ ఇస్తుంది. దీంతో అప్పుడు ఎందుకు 20 లక్షలు తీసుకున్నానో అందరికీ తెలుసు. మామయ్య గారి ఆపరేషన్ కోసం తీసుకున్న డబ్బులు అవి. అందుకే అప్పుడు తెల్ల పేపర్ల సంతకం పెట్టాల్సి వచ్చింద. లేకపోతే శశికళ డబ్బులు ఇవ్వనన్నది.. అని చెబుతుంది తులసి.

will tulasi repay 80 lakhs to shashikala

will tulasi repay 80 lakhs to shashikala

కాబట్టి.. ఆ డబ్బులను అందరూ కట్టాల్సిందే. నా వంతుగా నేను 20 లక్షలు కడతాను. మిగితా వాళ్లు మీ డబ్బులు రెడీ చేసుకోండి. ఇఫ్పటికప్పుడు అంటే డబ్బులు కట్టలేం అని తులసి చెప్పడంతో.. వారం రోజుల్లో డబ్బు కట్టాల్సిందే. లేదంటే నేను ఈ ఇంటిని స్వాధీనం చేసుకుంటా అని చెప్పి శశికల వెళ్లిపోతుంది. బాగుంది తులసి.. డబ్బులు తీసుకునేప్పుడు మాత్రం నీ ఇష్టం. ఇప్పుడు మాత్రం అప్పును అందరినీ షేర్ చేసుకోమంటావా అంటూ తులసిపై లాస్య సీరియస్ అవుతుంది. మరోవైపు మనకెందుకు ఈ తలనొప్పి అని అంకితతో అంటాడు అభి. అలా అంటావు ఏంటి అభి. అప్పుడు తాతయ్యకు సీరియస్ గా ఉంది కాబట్టి ఆ పని చేసింది కదా. నువ్వు పెద్ద కొడుకుగా నీ షేర్ డబ్బులు 20 లక్షలు కట్టాల్సిందే అభి అంటుంది అంకిత.

దీంతో సరే.. నా తిప్పలు ఏవో నేను పడతాను కానీ.. నేను డబ్బు తీసుకొస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని మాత్రం నన్ను అడగొద్దు అని అంటాడు అభి. మరోవైపు తులసి.. ఫ్యాక్టరీ మేనేజర్ కు ఫోన్ చేసి అకౌంట్ లో డబ్బులు ఎన్ని ఉన్నాయి అని అడుగుతుంది.

దీంతో నాలుగైదు లక్షలు ఉంటాయి మేడమ్ అంటాడు. దీంతో అంతే ఉన్నాయా అని అంటుంది. సరే అని ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో అనసూయ వచ్చి తప్పు చేశావు తులసి అని అంటుంది అనసూయ. ఇంతలో పరందామయ్య వచ్చి తులసిని ఏం అనకు అనసూయ అంటాడు పరందామయ్య.

Intinti Gruhalakshmi : తులసిని తప్పుగా అర్థం చేసుకున్న అనసూయకు కనువిప్పు కలిగించిన పరందామయ్య

ఈ ఇంటిని తులసికి రాసిచ్చినంత మాత్రాన.. ఈ ఇంటి భారం తులసి మోయాలని నేను అనుకోలేదు. అది కాదండి.. అప్పుడు తెల్ల కాగితం మీద సంతకం పెట్టడం ఏంటి అంటుంది. దీంతో తులసి అప్పుడు తెల్లకాగితం మీద సంతకం పెట్టకుండా ఉండి ఉంటే ఇప్పుడు నీ నుదిటిన బొట్టు ఉండేది కాదు అంటాడు పరందామయ్య.

మరోవైపు అభి.. ఓ సేటు దగ్గరికి వెళ్లి తన ఎంబీబీఎస్ సర్టిఫికెట్లను తాకట్టు పెట్టి 10 లక్షలు అప్పు తీసుకుంటాడు. మరోవైపు తన షేర్ డబ్బులు ఎలా తీర్చాలా అని నందు టెన్షన్ పడుతుంటాడు. తులసి చేసిన అప్పును మనం ఎందుకు తీర్చాలి అంటుంది లాస్య.

ఆ అప్పు చేసింది మా నాన్న గారి కోసమే కదా అంటాడు నందు. అప్పుడు తీసుకున్నది 20 లక్షలే కదా. అందులోనే షేర్ చేయమను అంటుంది లాస్య. ఏమో లాస్య నాకేం అర్థం కావడం లేదు అంటాడు నందు. నీ కెఫెలో నీకు ఇప్పుడు లోన్ వస్తుందా. నేను కూడా నిన్న కాక మొన్ననే ఉద్యోగంలో చేరాను.. అంటుంది లాస్య.

మరోవైపు తను అప్పుగా తీసుకున్న 10 లక్షల రూపాయలను తీసుకెళ్లి తన ఫ్రెండ్ ప్రకాశ్ చేతుల్లో పెడతాడు అభి. వీటిని స్టాక్స్ లో పెట్టు అంటాడు. దీంతో సరేరా రేపు పెడతా అంటాడు. కానీ.. అతడు అభిని మోసం చేస్తున్నాడు అనే విషయం అభి తెలుసుకోలేకపోతాడు.

మరోవైపు తులసి, అంకిత, పరందామయ్య, అనసూయ అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుంటారు. అప్పుడే అక్కడికి లాస్య, నందు వస్తారు. వాళ్లు సంతోషంగా ఉండటం చూసి ముద్ద ఎలా దిగుతుంది తులసి అని ప్రశ్నిస్తుంది లాస్య.

దీంతో లాస్య షాక్ అవుతుంది. అవునులే ఎందుకు దిగదు. నీ దురదృష్టాన్ని, నీ కష్టాన్ని అందరికీ తలో కొంత పంచేశావు కదా అంటుంది లాస్య. బారం దిగిపోయి ఉంటుంది. హ్యాపీగా ఉండు ఇక అంటుంది లాస్య. ఇన్నిరోజులు లాస్య మాటలు వినిపించుకోకుండా.. పట్టించుకోకుండా తప్పు చేశాను అని అంటాడు నందు. ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నాను అంటాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది