Yash : మాల్దీవుల్లో మకాం.. భార్యతో ‘రాకీ భాయ్’ రచ్చ

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 19 January 2021, 8:45 pm

Yash కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ఇప్పుడు రాకీ భాయ్‌గానే అందరికీ సుపరిచితుడు. కేజీయఫ్ సినిమాతో రాకీ భాయ్‌గా యశ్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్కసారిగా దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. కేజీయఫ్ సినిమాతో రాకీ భాయ్ వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. దానికి ఉదాహరణే ఆ మధ్య రిలీజ్ చేసిన చాప్టర్ 2 టీజర్. ముందుగానే లీక్ అయినా.. అనుకున్న సమయం కంటే ముందుగానే టీజర్ విడుదల చేసినా కూడా రికార్డుల్లో కొత్త ఒరవడిని సృష్టించింది.

yash enjoys with family in maldives

yash enjoys with family in maldives

కేజీయఫ్ చాప్టర్ 2 మిలియన్ల లైకులు..

కేజీయఫ్ చాప్టర్ 2ను సోషల్ మీడియాలో ముందుగానే లీకైంది. దాన్ని ఆపలేమని తెలుసుకున్న యూనిట్.. అఫీషియల్ టీజర్‌ను వెంటనే రిలీజ్ చేసింది. ఇక ఆ టీజర్ రికార్డులు ఇప్పటికీ ఆగడం లేదు. వ్యూస్‌లో మిలియన్లు చూసి ఉంటారు..కానీ ఇక్కడ లైకుల్లోనూ మిలియన్లకు మిలియన్లు క్రాస్ అవుతున్నాయి. దాదాపు రెండు వందల మిలియన్ల వ్యూస్ కొల్లగొడితే ఆరేడు మిలియన్ల లైకులు కూడా వచ్చాయి.

యశ్ ప్రస్తుతం అలా..

ప్రస్తుతం యశ్ తన ఫ్యామిలీని తీసుకుని ప్రశాంతంగా గడిపేందుకు మాల్దీవులకు వెళ్లాడు. మాల్దీవుల ప్రభుత్వం మన సెలెబ్రిటీలను ఫ్రీగా అక్కడికి తీసుకెళ్లి టూరిజాన్ని ప్రమోట్ చేసుకుంటున్నట్టుంది. మన తారలందరూ అక్కడికే పనిగట్టుకుని వెళ్లినట్టు వెళ్తున్నారు. భూమ్మీద స్వర్గమనేది ఉంటే అది ఇదే అంటూ మాల్దీవుల గురించి యశ్ గొప్పగొ చెప్పాడు. ప్రస్తుతం యశ్ తన ఫ్యామిలీతో దిగిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి