Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తెలుగులోనే కాదు దేశ విదేశాలలోను అశేష ప్రేక్షకాదరణ పొందాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రభాస్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులతో కూడా సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ అభిమానుల ఫోకస్ మొత్తం ఎక్కువగా సలార్ సినిమాపైనే ఉంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాధే శ్యామ్ సినిమా తీవ్రస్థాయిలో నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా ఇండియాలోనే అత్యధిక స్థాయిలో నష్టాలను మిగిల్చిన సినిమాగా కూడా నిలిచింది .
దీంతో సలార్ చిత్రంతో ప్రభాస్ తిరిగి ఫాంలోకి రావాలని, ఈ సారి బాహుబలి రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నారు.సాధారణంగా సినిమాల్లో హీరోలను ఎలివేట్ చేయాడానికి పులులతో లేక సింహాలతో పోల్చుతూ డైలాగ్స్ రూపంలో గానీ, లేక పాట రూపంలో గానీ వదులుతుంటారు.కాని దీనికి రివర్స్‌గా ఓ రాయల్ బెంగాల్ టైగర్‌కు ప్రభాస్ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఉన్న ఓ రాయల్ బెంగాల్ టైగర్‌కు ప్రభాస్ పేరు పెట్టారట. దీనికి సంబంధించి ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇది కదా అసలైన ఎలివేషన్ అంటూ.. సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
బాహుబలి సినిమాలతో ఆయన ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు.బాహుబలి తర్వాత ప్రభాస్ ఎంచుకున్న సినిమాలు ఏమాత్రం ఆయన ఫ్యాన్స్‌ను కానీ, లేదా కామన్ సినీ ప్రేక్షకున్ని గానీ సంతృప్తి పరచలేదు. సినిమాలను భారీగా తీసిన.. సరైన కంటెంట్ లేక బాక్సాఫీస్ దగ్గర చేతులెస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ కేజిఎఫ్ సక్సెస్ అనంతరం సలార్ సినిమాపై ఎక్కువగా పెడుతున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక మిగిలిన భాగాన్ని మరికొన్ని రోజుల్లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ రెడీ చేసుకుంటున్నాడు. అంతేకాకుండా ప్రభాస్ అభిమానులకు త్వరలోనే అదిరిపోయే అప్డేట్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాడు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.