Prabhas : ప్ర‌భాస్ క్రేజ్ అంటే ఇదే మ‌రి.. బెంగాల్ పులికి యంగ్ రెబ‌ల్ స్టార్ పేరు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : ప్ర‌భాస్ క్రేజ్ అంటే ఇదే మ‌రి.. బెంగాల్ పులికి యంగ్ రెబ‌ల్ స్టార్ పేరు

 Authored By sandeep | The Telugu News | Updated on :1 May 2022,2:30 pm

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు తెలుగులోనే కాదు దేశ విదేశాల‌లోను అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రస్తుతం ప్రభాస్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులతో కూడా సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ అభిమానుల ఫోకస్ మొత్తం ఎక్కువగా సలార్ సినిమాపైనే ఉంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాధే శ్యామ్ సినిమా తీవ్రస్థాయిలో నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా ఇండియాలోనే అత్యధిక స్థాయిలో నష్టాలను మిగిల్చిన సినిమాగా కూడా నిలిచింది .

దీంతో స‌లార్ చిత్రంతో ప్ర‌భాస్ తిరిగి ఫాంలోకి రావాల‌ని, ఈ సారి బాహుబ‌లి రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాల‌ని కోరుకుంటున్నారు.సాధార‌ణంగా సినిమాల్లో హీరోలను ఎలివేట్ చేయాడానికి పులులతో లేక సింహాలతో పోల్చుతూ డైలాగ్స్ రూపంలో గానీ, లేక పాట రూపంలో గానీ వదులుతుంటారు.కాని దీనికి రివ‌ర్స్‌గా ఓ రాయల్ బెంగాల్ టైగర్‌కు ప్రభాస్ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఉన్న ఓ రాయల్ బెంగాల్ టైగర్‌కు ప్రభాస్ పేరు పెట్టారట. దీనికి సంబంధించి ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇది కదా అసలైన ఎలివేషన్ అంటూ.. సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

Young Rebel Star Prabhas Name For Bengal Tiger

Young Rebel Star Prabhas Name For Royal Bengal Tiger

Prabhas : టైగ‌ర్ ప్ర‌భాస్…

బాహుబలి సినిమాలతో ఆయన ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు.బాహుబలి తర్వాత ప్ర‌భాస్ ఎంచుకున్న సినిమాలు ఏమాత్రం ఆయన ఫ్యాన్స్‌ను కానీ, లేదా కామన్ సినీ ప్రేక్షకున్ని గానీ సంతృప్తి పరచలేదు. సినిమాలను భారీగా తీసిన.. సరైన కంటెంట్ లేక బాక్సాఫీస్ దగ్గర చేతులెస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ కేజిఎఫ్ సక్సెస్ అనంతరం సలార్ సినిమాపై ఎక్కువగా పెడుతున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక మిగిలిన భాగాన్ని మరికొన్ని రోజుల్లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ రెడీ చేసుకుంటున్నాడు. అంతేకాకుండా ప్రభాస్ అభిమానులకు త్వరలోనే అదిరిపోయే అప్డేట్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాడు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది