JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్.. భారీ మ్యాటర్ లీక్ అయ్యింది
JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీ సీనియర్ నేత ఆయన. జేసీ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాగుందని చెప్పుకోవాలి. నిజానికి జేసీ మీద ప్రస్తుతం ఉన్న ఆరోపణలు ఎక్కువే. చాలా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు జేసీ. చివరకు సంతకాల ఫోర్జరీ కేసు కూడా ఆయన మీద ఉంది. అయితే.. పలు ఇతర ఆరోపణలపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ గత రెండు రోజులుగా విచారిస్తోంది. ఏదో విచారించడం కాదు.. అనంతపురం పోలీసుల దగ్గర జేసీ మీద ఉన్న ఆరోపణలకు ఆధారాలు కూడా ఉన్నాయట.
ఆయన మీద చార్జిషీటు దాఖలు చేయడానికి కోర్టు పర్మిషన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈడీ కూడా జేసీ పాల్పడిన మనీ లాండరింగ్ కేసు మీదనే విచారిస్తోంది. ఈడీ విచారణ చేపడుతుండటంతో టీడీపీ నేతలకు కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎందుకంటే.. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనే అవకాశం ఉండదు కాబట్టి టీడీపీ చేతులు కట్టేసినంత పని అయింది.ఒకవేళ రాష్ట్ర పోలీసులో.. లేదంటే సీఐడీ అధికారులో జేసీపై విచారణ ప్రారంభిస్తే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఎల్లో మీడియా అయితే గగ్గోలు పెట్టేది. కానీ..
JC Prabhakar Reddy : ఈడీ దర్యాప్తు చేస్తున్నందుకే టీడీపీ నేతలు మాట్లాడటం లేదా?
అక్కడ జేసీని విచారించేది ఈడీ కాబట్టి ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఈడీపై ఆరోపణలు చేసే దమ్ము టీడీపీ నేతలకు ఉందా? ఈడీపై ఆరోపణలు అంటే అది డైరెక్ట్ గా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను అన్నట్టే. ఈ విషయంలో రాష్ట్ర పోలీసులు చాలా తెలివిగా వ్యవహరించారు. జేసీకి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సేకరించి వాటిని ఈడీకి అప్పగించారు. ఆధారలను సరిగ్గా చెక్ చేసుకున్న తర్వాతే ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. అందుకే.. ఈ విషయంలో జేసీ కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. అయితే.. విచారణ అనంతరం జేసీని అరెస్ట్ చేస్తారనే వార్తలు మాత్రం బాగా వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.