Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో రాజకీయ వేడి .. జేసీ పాలనపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో రాజకీయ వేడి .. జేసీ పాలనపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్

 Authored By ramu | The Telugu News | Updated on :17 January 2026,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో రాజకీయ వేడి .. జేసీ పాలనపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్

Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఘాటైన సవాల్ విసిరారు. అయిదేళ్ల తన పాలనపై రాయలసీమ ప్రాంతంలో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. పౌరుషాల పేరుతో తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం మానేసి, రాజకీయంగానో లేదా అభివృద్ధి పరంగానో ఎదుర్కోవాలని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి సూచించారు.ఏవైనా విభేదాలు ఉంటే రెండు కుటుంబాల మధ్యే తేల్చుకోవాలే తప్ప అమాయక ప్రజలను బలిచేయడం సరికాదని కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు పలికారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ఆ వ్యాఖ్యల్లో ఏదైనా తప్పు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని, కానీ తమ కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Kethireddy Peddareddy తాడిపత్రిలో రాజకీయ వేడి జేసీ పాలనపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్

Kethireddy Peddareddy : తాడిపత్రిలో రాజకీయ వేడి .. జేసీ పాలనపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్

Kethireddy Pedda Reddy: స‌వాల్ విసిరారు..

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మాట్లాడకుండా వ్యక్తిగత పౌరుషాలను ప్రస్తావించడం తగదని ఆయన అన్నారు. తాడిపత్రి డివిజన్‌లో ఎస్పీ ఆదేశాలతో కాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకే పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. అమాయకులపై మట్కా కేసులు బనాయించి, అసలు నిందితులను వదిలేస్తున్నారని మండిపడ్డారు.పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని పౌరుషాల గురించి మాట్లాడుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే తన పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని సూచించారు. ముఖాముఖి తేల్చుకునేందుకు సిద్ధమా? అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి నేరుగా సవాల్ విసిరారు. ఏం జరిగినా కేసులు పెట్టవద్దని ముందే లేఖ రాసి పోలీసులకు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.

రాజకీయాలకు సంబంధం లేని తన కుమారుడి గురించి మాట్లాడే ముందు, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి హైదరాబాద్‌కే పరిమితమైన తన అన్న కుమారుడి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ఎర్రవంకపై సమగ్ర విచారణ జరిపి సర్వే చేయాలని, తాడిపత్రి రూరల్ మండలంలో 15వ ఆర్థిక సంఘం నిధుల్లో సుమారు రూ.1.20 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. గ్రామంలో లేని వ్యక్తులకు బిల్లులు చేసినట్లు ఆధారాలతో కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి 20 రోజులు గడిచినా ఎలాంటి విచారణ జరగలేదని తెలిపారు.ఈ విచారణ జరగకుండా మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డే అడ్డుకుంటున్నారని ఆరోపించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యేగా తాను ఇచ్చిన ఫిర్యాదుకే దిక్కు లేకపోతే సామాన్య ప్రజల ఫిర్యాదులను ఈ ప్రభుత్వం ఎలా పట్టించుకుంటుందని ప్రశ్నించారు. తాడిపత్రి రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది