Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో హై టెన్షన్.. పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్.. సొంత ఊరుకి కూడా వెళ్లొద్దంటూ ఆగ్రహం..!
ప్రధానాంశాలు:
Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్.. సొంత ఊరుకి కూడా వెళ్లొద్దంటూ ఆగ్రహం..!
Kethireddy Pedda Reddy : తాడిపత్రి రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని శుక్రవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం ద్వారా పట్టణంలో హైటెన్షన్ పరిస్థితులు ఏర్పడ్డాయి. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేతిరెడ్డి, తన స్వగ్రామమైన తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరే సమయంలోనే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. కాగా, ఈ సమావేశానికి అధికారిక అనుమతి ఉన్నప్పటికీ, పెద్దారెడ్డికి మాత్రం తాడిపత్రికి వెళ్లవద్దని పోలీసులు ఆదేశించడం వివాదాస్పదంగా మారింది.

Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో హై టెన్షన్.. పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్.. సొంత ఊరుకి కూడా వెళ్లొద్దంటూ ఆగ్రహం..!
Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో ప్రజాస్వామ్యం అనేది ఉందా..? పెద్దిరెడ్డి సూటి ప్రశ్న
ఈ చర్యలపై కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనను తాడిపత్రికి రాకుండా అడ్డుకోవడం వెనుక టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి భయమే కారణమని ఆరోపించారు. ‘‘జేసీ నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే పోలీసులు అతని ఆదేశాల మేరకు నన్ను అడ్డుకుంటున్నారు’’ అంటూ మండిపడ్డారు. హైకోర్టు తాడిపత్రిలో ఉండేందుకు అనుమతి ఇచ్చినా, పోలీసులు తనపై ఆంక్షలు విధించడంపై అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును జేసీ తొత్తుల వైఖరిగా అభివర్ణించారు.
ప్రజాస్వామ్య విలువలు తాడిపత్రిలో హరించబడుతున్నాయన్న ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. ‘తాడిపత్రిలో సమావేశం నిర్వహించుకోవడానికి 18వ తేదీన అనుమతి ఇచ్చి, ఇప్పుడు వెళ్లొద్దంటారా? హైకోర్టు అనుమతి ఉన్నా నన్ను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులపై కక్ష సాక్షిగా ఉందని భావిస్తున్నా’ అంటూ పెద్దారెడ్డి ఆరోపించారు. తాజా ఘటనతో తాడిపత్రిలో రాజకీయ వేడి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
హైకోర్టు ఆదేశాలిచ్చినా అనుమతించరా..? – మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి
14 నెలలుగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సాకుతో అడ్డుకోవడం దుర్మార్గం
ఒక వ్యక్తిని తన సొంత ఊరిలోకి రానివ్వకుండా అడ్డుకోవడం న్యాయమా?
పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలకే లొంగిపోతున్నారా? – మాజీ ఎమ్మెల్యే… pic.twitter.com/COdEVu29po
— Telugu Feed (@Telugufeedsite) July 18, 2025