Budget Phones : ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు ప్రతిఒక్కరి చేతిలో ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ క్లాసుల పేరుతో స్టూడెంట్స్ కూడా స్మార్ట్ ఫోన్లను యూస్ చేస్తున్నారు. ఈ నేపథ్యలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు బడ్జెట్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేశాయి. అందరికీ అందుబాటులో ధరల్లో లభిస్తున్నాయి. ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో ఈ మొబైల్స్ కొనుగోలు చేయవచ్చు. రెడ్ మీ, రియల్ మీ, పోకో, మైక్రోమ్యాక్స్, వివో వంటి కంపెనీల స్మార్ ఫోన్లు బడ్జెట్ లో కొనుగోలు చేసేలా డిజైన్ చేశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఫ్లిప్ కార్ట్ లో మైక్రోమ్యాక్స్ ఐఎన్ 2బీ ఫోన్ 6జీబీ ర్యామ్ తో అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ ధర కేవలం రూ.9499 గా ఉంది. 6.52 ఇంచెస్ డిస్ప్లేతో 5000 ఎమ్ ఏ ఎచ్ బ్యాటరీ కెపాసిటీతో డ్యుయెల్ కెమెరాతో పాటు ఇతర ఫీచర్లు ఉన్నాయి. అలాగే రెడ్‌మీ నోట్ 10టీ 5జీ రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. రెండింటిపైనా ధరను రూ.2000 తగ్గించింది షావోమీ. రూ.13,999గా ఉన్న 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999కు వచ్చింది. 6జీబీ ర్యామ్ + 128జీబీ టాప్ వేరియంట్ రూ.15,999కు లాంచ్ కాగా.. ఇప్పుడు రూ.13,999కే అందుబాటులో ఉంది. మెటాలిక్ బ్లూ, మింట్ గ్రీన్, క్రోమియమ్ వైట్, గ్రాఫైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో ఈ మొబైల్ లభ్యమవుతోంది. షావోమీ అధికారిక వెబ్‌సైట్ mi.comతో పాటు ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో కూడా కొత్త ధరలు అమలులో ఉంది. రియల్ మీ నుంచి మరో ఫోన్ బడ్జెట్ లో లాంచ్ అయింది.
రియల్ మీ 9ఐ ఫోన్ 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ + ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ఈ మొబైల్ వస్తోంది. 90 హెట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కు సపోర్టు చేసే ఈ డిస్‌ప్లేలో 480 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ వరకు ఉంటుంది. అలాగే స్నాప్‌డ్రాగన్ 680 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. ఈ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుండగా.. 33W ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్టు చేయనుంది. ఈ ఫోన్ ని రూ.15,999 కు కొనుగోలు చేయవచ్చు. అలాగే వివో టీ1 44డబ్ల్యూ స్మార్ట్ ఫోన్ 6 జీబీ ర్యామ్ తో రూ.15.999 కి కొనుగోలు చేయవచ్చు. 6.44 ఇంచెస్ డిస్ ప్లేతో 5000 ఎమ్ ఏ ఎచ్ బ్యాటరీ కెపాసిటీతో అందుబాటులో ఉంది. అలాగే పోకో ఎమ్ 2 స్మార్ట్ ఫోన్ 6 జీబీ ర్యామ్ తో 128 జీబీ స్టోరేజ్ తో రూ. 11.499 కొనుగోలు చేయవచ్చు. 6.53 ఇంచెస్ డిస్ ప్లేతో క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.