In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : అన్నింటా వ్యయప్రయాసలతో కూడిన రోజు. అనుకోని ప్రయాణాలు. ఆర్థికంగా సాధారణ స్థితి. కొత్త పనులు ప్రారంభించడానికి అనకూలమైన రోజు కాదు. ఇంటా, బయటా పని వత్తిడి పెరుగుతుంది. చికాకులతో ఈరోజు గడిచిపోతుంది. ఓపిక, సహనం చాలా ముఖ్యం. శ్రీ సుబ్రమణ్య భుజంగం చదువుకుంటే మంచి ఫలితం వస్తుంది. వృషభ రాశి ఫలాలు : కొంచెం సుఖం, కొంచెం కష్టంతో కూడిన రోజు. ఆర్థికంగా ఎక్కువ లాభాలు రాకున్నా ఇబ్బంది ఏమీ ఉండదు. అన్నతమ్ముల నుంచి మంచి సహాయం అందుతుంది. వ్యాపారాలు, విద్య, ఉద్యోగ విషయాలలో సానుకూలమైన పలితాలు వస్తాయి. దీర్గకాలిక పెట్టుబడులకు అనుకూలమైన రోజు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : విద్య, ఉద్యోగ విషయాలలో అనకూలత కొంత తక్కువ. ధైర్యంతో పనులు చేస్తే విజయం సాధిస్తారు. అన్నింటా మీరు అనుకున్నంత సులువుగా ఉండదు. కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. మహిళలకు పని బారం. సాయంత్రం నుంచి శుభవార్త శ్రవణం జరుగవచ్చు. శ్రీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా పర్వాలేదు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. పెట్టుబడులకు మంచి రోజు కాదు.కొత్త పనులు తప్పనిసరి అయితేనే ప్రారంభించండి. విద్య, ఉద్యోగ విషయాలలో సానుకూలతలు తక్కువే. మహిళలకు చికాకులు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం మంచి ఫలితాన్నిస్తుంది.
Today Horoscope June 29 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. అన్నింటా శ్రమ పెరుగుతుంది. ఆఫీస్‌లో, ఇంట్లో మీకు శ్రమకు తగ్గ ఫలితం రాదు. ఆర్థిక విషయంలో సామాన్యంగా ఉంటుంది. ప్రయాణ సూచన. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం జాగ్రత్త. అమ్మవారి ఆరాధన చేయండి.
కన్యా రాశి ఫలాలు : పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. అనుకున్న పనులు నిదానంగానైనా పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలలో సానుకూలత ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అంత అనువైన రోజు కాదు. కొత్త వారి పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది. ప్రశాంత వాతావరణం. భార్య/ భర్త తరపు వారి నుంచి శుభవార్తలు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
తులా రాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. అన్నింటా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఇంటా, బయటా మీరు ఆశించిన విధంగా పనులు పూర్తి అవుతాయి. విద్య, ఉద్యోగ విషయాలు అనుకూలం. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : సాధారణ పరిస్తితితో కూడిన రోజు. శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. అన్ని రకాల వృత్తుల వారికి సామాన్యంగా ఉంటుంది. కొత్త వస్తువులు, విలువైన ఆభరణాలు కొనడానికి ప్రయత్నిస్తారు. మహిలలకు మంచి వార్తలు అందుతాయి. ఆదాయం కోసం కొత్త మార్గాల అన్వేషణ చేస్తారు. గణపతి దేవాలయంలో బెల్లం ప్రసాదంగా సమర్పించండి మంచి ఫలితం వస్తుంది.
ధనస్సు రా శి ఫలాలు : ప్రతికూలమైన రోజు. ధైర్యంతో ముందుకుపోతే కొంచెం అనకూలత పెరుగుతుంది. పెద్దల మనస్సు నొప్పిస్తారు. మానసిక ప్రశాంతత కరువతుంది. అన్నింటా శ్రమ భారం పెరుగుతుంది. మహిళలకు చికాకులు, అరోగ్య భంగం. దుర్గాదేవి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టండి.
మకర రాశి ఫలాలు : ఇబ్బందులు ఎదురవుతాయి. పెద్దల ద్వారా సహయం అందుతుంది. అన్ని రకాల వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఉమ్మడి పెట్టుబడులకు మంచి సమయం కాదు. అనవసర ఖర్చులు వస్తాయి. రోగాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మంచి ఫలితాల కోసం శ్రీ సిద్ధిగణపతి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు వస్తాయి. అనుకోని ప్రయాణాలు. పాత బకాయిలు వసూలు అవుతాయి. కొత్త వస్తువులు కొంటారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు మంచి రోజు. శ్రీ లలితాదేవి ఆరాదన చేయండి.
మీన రాశి ఫలాలు : మీరు అన్నింటా విజయం సాధిస్తారు. చక్కటి ధనలాభాలు కలుగుతాయి. కుటుంబంలో సానుకూలమైన మార్పులు. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలమైన రోజు. ప్రేమికుల మధ్య సఖ్యత పెరుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన రోజు. చాలా కాలంగా ఉన్న సమస్యలు తొలిగిపోతాయి. శ్రీ హేరంబ గణపతి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
This website uses cookies.