Viral Video : బుల్లెట్ బండి సాంగ్‌కు దుమ్ములేపిన వధువు… డ్యాన్స్ వేరే లెవ‌ల్‌..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Viral Video : బుల్లెట్ బండి సాంగ్‌కు దుమ్ములేపిన వధువు… డ్యాన్స్ వేరే లెవ‌ల్‌..!

Viral Video : ఇప్పుడు పెళ్లి, పేరంటం అని తేడా లేకుండా ఏ ఫంక్ష‌న్‌లోనైనా బుల్లెట్ బండి పాట ప్లే అవ్వాల్సిందే. ఇప్పిటికే యూట్యూబ్‌, ఇన్‌స్టా రీల్స్‌లో బాగా ట్రెండ్ అయ్యి ఈ సాంగ్ రికార్డులు క్రియేట్ చేసింది. ఆ మ‌ధ్య పెళ్లి ఊరేగింపులో ఈ పాట‌కు డ్యాన్స్ చేసి కొత్త‌గా పెళ్లైన జంట అంద‌ర్నీ ఆక‌ర్షించారు. ఆ వీడియో అప్ప‌ట్లో బాగా ట్రెండ్ అయ్యింది. తాజాగా త‌మ పెళ్లి వేడుక‌లో వ‌ధువ‌రులు ఇద్ద‌రూ బుల్లెట్ బండి […]

 Authored By mallesh | The Telugu News | Updated on :23 October 2022,7:00 pm

Viral Video : ఇప్పుడు పెళ్లి, పేరంటం అని తేడా లేకుండా ఏ ఫంక్ష‌న్‌లోనైనా బుల్లెట్ బండి పాట ప్లే అవ్వాల్సిందే. ఇప్పిటికే యూట్యూబ్‌, ఇన్‌స్టా రీల్స్‌లో బాగా ట్రెండ్ అయ్యి ఈ సాంగ్ రికార్డులు క్రియేట్ చేసింది. ఆ మ‌ధ్య పెళ్లి ఊరేగింపులో ఈ పాట‌కు డ్యాన్స్ చేసి కొత్త‌గా పెళ్లైన జంట అంద‌ర్నీ ఆక‌ర్షించారు. ఆ వీడియో అప్ప‌ట్లో బాగా ట్రెండ్ అయ్యింది. తాజాగా త‌మ పెళ్లి వేడుక‌లో వ‌ధువ‌రులు ఇద్ద‌రూ బుల్లెట్ బండి పాట‌కు డ్యాన్స్ చేసి అంద‌రిలో జోష్ తెచ్చారు . పెళ్లికి హాజ‌రైన బంధుమిత్రులంద‌రూ వీరి డ్యాన్స్ చూసి ఫిదా అయ్యారు.

ఇప్పుడు వీరు డ్యాన్స్ చేసిన వీడియో సోష‌ల్‌మీడియాను షేక్ చేస్తుంది.పెళ్లి అంటే స‌ర‌దాలు, డ్యాన్స్‌లు అన్నీ ఉండాల్సిందే. అందుకే తాజాగా జ‌రిగిన ఓ పెళ్లి వేడుక‌లో ఇద్ద‌రు అమ్మాయిలు ఫంక్ష‌న్‌లో ఊపు తెచ్చేందుకు బుల్లెట్ బండి పాట‌కు వ‌ధువ‌రుల ప‌క్క‌న డ్యాన్స్ చేశారు. అయితే వీరి డ్యాన్స్ చూసిన ఆ జంట తామెం త‌క్కువ అన్న‌ట్లు వారితో క‌లిసి స్టెప్పులేశారు. ఇలా వీళ్లు చేసిన డ్యాన్స్ వివాహానికి హాజ‌రైన వారందిరినీ విశేషంగా ఆక‌ర్షించింది. దీంతో బుల్లెట్ బండి సాంగ్‌కు ఇంకా క్రేజ్ త‌గ్గ‌లేద‌ని ఈ వీడియోను చూసిన వారంతా అనుకుంటున్నారు.

Bride Dance to Bullet Bandi song on video

Bride Dance to Bullet Bandi song on video

అంతేకాకుండా వ‌ధువ‌రుల డ్యాన్స్ కూడా సూప‌ర్‌గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే ల‌క్ష‌మందికి పైగా దీనిని వీక్షించారు. బుల్లెట్ బండి పాట‌కు వీరే కాకుండా కాలేజ్ స్టూడెంట్స్‌, వినాయ‌క నిమ‌జ్జ‌నం స‌మ‌యంలో కుర్ర‌కారు కూడా విప‌రీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాట‌కు డ్యాన్సులు వేస్తూ, రీల్స్ చేస్తూ ఈ పాటపై త‌మ‌కున్న ప్రేమ‌ను తెలియ‌జేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏ కార్య‌క్ర‌మ‌మైన ఈ పాట ఒక్క‌సారైనా ప్లే అవ్వాల్సిందే అని అంతా అంటున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది