Diwali Festival : దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి ..?? 12నా లేక 13వ తేదినా.. ??

Advertisement
Advertisement

Diwali Festival : ఈ ఏడాది పండుగలన్ని రెండు రోజులలో వచ్చాయి. దీంతో జనాలు ఏ రోజు చేసుకోవాలని సందిగ్ధంలో పడ్డారు. ఇక ఇప్పుడు వచ్చిన దీపావళి కూడా రెండు రోజులు రావడంతో ఏ రోజున జరుపుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంది. ప్రతి ఏటా దీపావళి ఆశ్వయుజ అమావాస్యనాడు వస్తుంది. అలాగే దీనికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. సాధారణంగా హిందువుల పండుగలలో తిధి సూర్యోదయానికి ఉండడమే లెక్క. కానీ దీపావళి మాత్రం సాయంత్రం లక్ష్మీ పూజ చేసి దీపాలు వెలిగిస్తారు. కాబట్టి అమావాస్య ఘడియలు ఉన్న సాయంత్రం రోజున పరిగణలోకి తీసుకోవాలి.

Advertisement

అయితే అమావాస్య గడియలు 12,13 తేదీల్లో రావడంతో చాలామందిలో గందరగోళం నెలకొంది. దీనిపై పండితులు స్పష్టత ఇస్తున్నారు. నవంబర్ 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం నుంచి అమావాస్య ఘడియలు మొదలై 13 వ తేదీ సోమవారం మధ్యాహ్నం ముగుస్తున్నాయి. కాబట్టి సాయంత్రం ఉండే అమావాస్య ఘడియలను లెక్కలోకి తీసుకోవాలని ,12వ తేదీన దీపావళిని చేసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి వస్తుంది. కాబట్టి 12వ తేదీన దీపావళి జరుపుకుంటే నరక చతుర్దశి 11వ తేదీ అవుతుందని అనుకోవద్దని చెబుతున్నారు. ఎందుకంటే చతుర్దశి తిధి సూర్యోదయానికి ఉన్నదే పరిగణలోకి తీసుకుంటారు.

Advertisement

అందువల్ల 12న ఆదివారం సూర్యోదయానికి చతుర్దశి తిధి ఉండడంతో ఆరోజునే ఉదయం నరక చతుర్దశి జరుపుకోవాలని, సాయంత్రానికి అమావాస్య తిథి వస్తుండడంతో అదే రోజు రాత్రి దీపావళి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దీపావళికి బహుళ ఆశ్వీయుజ చతుర్దశి, అర్ధరాత్రి అమావాస్య ప్రామాణికం. నవంబర్ 11 శనివారం మధ్యాహ్నం 12:50 వరకు త్రయోదశి తిధి ఉంది. ఆ తర్వాత నుంచి చతుర్దశి గడియలు మొదలవుతున్నాయి. చతుర్దశి తిధి నవంబర్ 11న మధ్యాహ్నం 12:50 నుంచి నవంబర్ 1:53 వరకు ఉంది. అమావాస్య తిథి నవంబర్ 12 న 1:54 నుంచి నవంబర్ 13 న 2:13 వరకు ఉంది.

Advertisement

Recent Posts

Job Mela : మిరాకిల్ కాలేజీలో మినీ జాబ్ మేళా.. జీతం రూ.3.50 ల‌క్ష‌లు

Job Mela : యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో…

8 mins ago

Jaggery : బెల్లం తో కూడా చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా…!!

Jaggery :  బెల్లం అనేది రుచికి మాత్రమే కాదు చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది అని మీకు తెలుసా.…

1 hour ago

Namo Bharath Rapid Rail : ఇక నుంచి వందే భారత్ కాదు.. వందే మెంట్రో..!

Namo Bharath Rapid Rail : దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల గురించి విసృత ప్రచారం…

10 hours ago

Johnny Master : జానీ మాస్టర్ కేసు.. దాదాపు ఐదేళ్ల నుంచి ఈ వ్యవహారం నడుస్తుందా..?

Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధిపు కేసు విషయంలో రోజు రోజుకి నిర్గాంతపోయే నిజాలు…

11 hours ago

Janhvi kapoor : దేవర కోసం జాన్వి కపూర్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా..?

Janhvi kapoor : ఎన్టీఆర్ దేవర సినిమా మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను కొరటాల…

12 hours ago

Chandra Dosham : చంద్ర దోష నివారణకు ఈ పరిహారాలు తప్పక పాటించండి… సనాతన ధర్మం ఏం చెబుతుందంటే…!

Chandra Dosham : హిందూ మతంలో ఏడు రోజులు ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. అయితే సోమవారం…

13 hours ago

Chandrababu : మోదీని చూసి బాబు ఎందుకు అంత ఉప్పొంగిపోతున్నారు.. అసలు విష‌యం తేల్చ‌ట్లేదుగా..!

Chandrababu : రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో 2024 నాలుగో విడత సమావేశానికి గాంధీనగర్ ఆతిథ్యాం ఇస్తుండ‌గా,…

14 hours ago

Hyper Aadi : జానీ మాస్ట‌ర్ బాగోతాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌టికి.. హైప‌ర్ ఆది అప్ప‌ట్లోనే చెప్పేశాడుగా..!

Hyper Aadi : జానీ మాస్టర్ మీద ఢీ కంటెస్టెంట్, లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయ‌డం మ‌న‌కు తెలిసిందే.. కేవలం…

15 hours ago

This website uses cookies.