Diwali Festival : దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి ..?? 12నా లేక 13వ తేదినా.. ??
ప్రధానాంశాలు:
Diwali Festival : దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి ..??
దీపావళి పండుగ 12నా లేక 13వ తేదినా.. ??
Diwali Festival : ఈ ఏడాది పండుగలన్ని రెండు రోజులలో వచ్చాయి. దీంతో జనాలు ఏ రోజు చేసుకోవాలని సందిగ్ధంలో పడ్డారు. ఇక ఇప్పుడు వచ్చిన దీపావళి కూడా రెండు రోజులు రావడంతో ఏ రోజున జరుపుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంది. ప్రతి ఏటా దీపావళి ఆశ్వయుజ అమావాస్యనాడు వస్తుంది. అలాగే దీనికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. సాధారణంగా హిందువుల పండుగలలో తిధి సూర్యోదయానికి ఉండడమే లెక్క. కానీ దీపావళి మాత్రం సాయంత్రం లక్ష్మీ పూజ చేసి దీపాలు వెలిగిస్తారు. కాబట్టి అమావాస్య ఘడియలు ఉన్న సాయంత్రం రోజున పరిగణలోకి తీసుకోవాలి.
అయితే అమావాస్య గడియలు 12,13 తేదీల్లో రావడంతో చాలామందిలో గందరగోళం నెలకొంది. దీనిపై పండితులు స్పష్టత ఇస్తున్నారు. నవంబర్ 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం నుంచి అమావాస్య ఘడియలు మొదలై 13 వ తేదీ సోమవారం మధ్యాహ్నం ముగుస్తున్నాయి. కాబట్టి సాయంత్రం ఉండే అమావాస్య ఘడియలను లెక్కలోకి తీసుకోవాలని ,12వ తేదీన దీపావళిని చేసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి వస్తుంది. కాబట్టి 12వ తేదీన దీపావళి జరుపుకుంటే నరక చతుర్దశి 11వ తేదీ అవుతుందని అనుకోవద్దని చెబుతున్నారు. ఎందుకంటే చతుర్దశి తిధి సూర్యోదయానికి ఉన్నదే పరిగణలోకి తీసుకుంటారు.
అందువల్ల 12న ఆదివారం సూర్యోదయానికి చతుర్దశి తిధి ఉండడంతో ఆరోజునే ఉదయం నరక చతుర్దశి జరుపుకోవాలని, సాయంత్రానికి అమావాస్య తిథి వస్తుండడంతో అదే రోజు రాత్రి దీపావళి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దీపావళికి బహుళ ఆశ్వీయుజ చతుర్దశి, అర్ధరాత్రి అమావాస్య ప్రామాణికం. నవంబర్ 11 శనివారం మధ్యాహ్నం 12:50 వరకు త్రయోదశి తిధి ఉంది. ఆ తర్వాత నుంచి చతుర్దశి గడియలు మొదలవుతున్నాయి. చతుర్దశి తిధి నవంబర్ 11న మధ్యాహ్నం 12:50 నుంచి నవంబర్ 1:53 వరకు ఉంది. అమావాస్య తిథి నవంబర్ 12 న 1:54 నుంచి నవంబర్ 13 న 2:13 వరకు ఉంది.