Chicken pakodi Recipe : ఈరోజు చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో మనం తెలుసుకోబోతున్నాం.. చికెన్ పకోడీ పేరు వింటుంటేనే నోట్లో నీళ్లు వస్తూన్నాయా.. చేసుకునే తింటే పక్కవాళ్ళకి ఒక్క ముక్క కూడా పెట్టాలనిపించింది.. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్ గా చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ..ఈ కొలతలతో ఈ విధానాల్లో గనక మీరు చికెన్ పకోడీ చేస్తే ముక్కలు అనేవి ఆయిల్ అసలు పీల్చవండి. క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ చికెన్ పకోడీ టేస్ని చూపించండి. దీనికి కావలసిన పదార్థాలు:చికెన్, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పౌడర్, గరం మసాలా, ధనియాల పౌడర్, నిమ్మరసం, ఆయిల్, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, శెనగపిండి, రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ మొదలైనవి..
తయారీ విధానం: ఇక్కడ హాఫ్ కేజీ దాకా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. అయితే చికెన్ చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ చికెన్ మొత్తాన్ని కూడా శుభ్రంగా ఉప్పు వేసి రెండు మూడు సార్లు పాటు బాగా వాష్ చేసుకోండి. ఆ తర్వాత వాటర్ లేకుండా శుభ్రంగా ముక్కలు మాత్రమే తీసుకొని ఒక బౌల్ లోకి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ దాకా పసుపు, వేసుకోండి. ఈ ఉప్పు పసుపు నిమ్మరసాన్ని ముక్కలకి బాగా పట్టించాలి. కనీసం ఒక రెండు నిమిషాల పాటు బాగా ఈ ముక్కల్ని కలుపుతూ మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల కారం ,హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీస్పూన్ దాకా ధనియాల పొడి, అర టీ స్పూన్ మిరియాల పొడి, అర స్పూన్ గరం మసాలా పౌడర్, రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా చికెన్ కి బాగా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి కొంచెం కలర్ ఫుల్ గా కనిపించడం కోసం రెడ్ ఫుడ్ కలర్ ని చిటికెడంత వేసుకోవచ్చు. అది జస్ట్ ఆప్షనల్ మాత్రమేనండి. చికెన్ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ రైస్ ప్లోర్,రెండు టేబుల్ స్పూన్ల సెనగపిండి ఇవి వేస్తే సరిపోతుంది.
ఇవి మాత్రం వేసేసిన తర్వాత ఈ పిండిని కూడా బాగా చికెన్ కి పట్టించండి. అవసరమైతే కొంచెం వాటర్ చేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోండి. పుదీనా కొద్దిగా అలాగే కొంచెం కరివేపాకు వేయండి. కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాక ఆయిల్ వేసి వీటన్నిటిని కూడా మళ్లీ తిరిగి ఒకసారి బాగా కలుపుకోండి. చికెన్ మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ చికెన్ ని కనీసం ఒక గంట పాటు మన ఫ్రిజ్లో పెట్టుకోవాలి. మీరు ఎంత సేపు చికెన్ మ్యారినేట్ చేస్తే చికెన్ పకోడా అంత టేస్టీగా వస్తుంది. అన్నమాట చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఫ్రిజ్లో టూ అవర్స్ పాటు ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా చికెన్ పీసెస్ ని విడివిడిగా వేస్తూ ఈవెన్గా క్రిస్పీగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇలా ఈవెన్ గా ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా పక్కకు తీసుకుని ఉల్లిపాయ ఇంకా నిమ్మకాయతో సర్వ్ చేసుకోండి. టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా గనక మీరు చికెన్ పకోడీ చేస్తే మీ ఇంట్లో వాళ్లందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.