Chicken pakodi Recipe : చికెన్ పకోడీ కరకరలాడుతూ నూనె పీల్చకుండా బండిమీద టేస్ట్ రావాలంటే ఇలా ట్రై చేయండి…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Chicken pakodi Recipe : చికెన్ పకోడీ కరకరలాడుతూ నూనె పీల్చకుండా బండిమీద టేస్ట్ రావాలంటే ఇలా ట్రై చేయండి…!

Chicken pakodi Recipe : ఈరోజు చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో మనం తెలుసుకోబోతున్నాం.. చికెన్ పకోడీ పేరు వింటుంటేనే నోట్లో నీళ్లు వస్తూన్నాయా.. చేసుకునే తింటే పక్కవాళ్ళకి ఒక్క ముక్క కూడా పెట్టాలనిపించింది.. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్ గా చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ..ఈ కొలతలతో ఈ విధానాల్లో గనక మీరు చికెన్ పకోడీ చేస్తే ముక్కలు అనేవి ఆయిల్ అసలు పీల్చవండి. క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 February 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Chicken pakodi Recipe : చికెన్ పకోడీ కరకరలాడుతూ నూనె పీల్చకుండా బండిమీద టేస్ట్ రావాలంటే ఇలా ట్రై చేయండి...!

Chicken pakodi Recipe : ఈరోజు చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో మనం తెలుసుకోబోతున్నాం.. చికెన్ పకోడీ పేరు వింటుంటేనే నోట్లో నీళ్లు వస్తూన్నాయా.. చేసుకునే తింటే పక్కవాళ్ళకి ఒక్క ముక్క కూడా పెట్టాలనిపించింది.. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్ గా చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ..ఈ కొలతలతో ఈ విధానాల్లో గనక మీరు చికెన్ పకోడీ చేస్తే ముక్కలు అనేవి ఆయిల్ అసలు పీల్చవండి. క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ చికెన్ పకోడీ టేస్ని చూపించండి. దీనికి కావలసిన పదార్థాలు:చికెన్, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పౌడర్, గరం మసాలా, ధనియాల పౌడర్, నిమ్మరసం, ఆయిల్, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, శెనగపిండి, రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ మొదలైనవి..

తయారీ విధానం: ఇక్కడ హాఫ్ కేజీ దాకా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. అయితే చికెన్ చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ చికెన్ మొత్తాన్ని కూడా శుభ్రంగా ఉప్పు వేసి రెండు మూడు సార్లు పాటు బాగా వాష్ చేసుకోండి. ఆ తర్వాత వాటర్ లేకుండా శుభ్రంగా ముక్కలు మాత్రమే తీసుకొని ఒక బౌల్ లోకి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ దాకా పసుపు, వేసుకోండి. ఈ ఉప్పు పసుపు నిమ్మరసాన్ని ముక్కలకి బాగా పట్టించాలి. కనీసం ఒక రెండు నిమిషాల పాటు బాగా ఈ ముక్కల్ని కలుపుతూ మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల కారం ,హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీస్పూన్ దాకా ధనియాల పొడి, అర టీ స్పూన్ మిరియాల పొడి, అర స్పూన్ గరం మసాలా పౌడర్, రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా చికెన్ కి బాగా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి కొంచెం కలర్ ఫుల్ గా కనిపించడం కోసం రెడ్ ఫుడ్ కలర్ ని చిటికెడంత వేసుకోవచ్చు. అది జస్ట్ ఆప్షనల్ మాత్రమేనండి. చికెన్ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ రైస్ ప్లోర్,రెండు టేబుల్ స్పూన్ల సెనగపిండి ఇవి వేస్తే సరిపోతుంది.

ఇవి మాత్రం వేసేసిన తర్వాత ఈ పిండిని కూడా బాగా చికెన్ కి పట్టించండి. అవసరమైతే కొంచెం వాటర్ చేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోండి. పుదీనా కొద్దిగా అలాగే కొంచెం కరివేపాకు వేయండి. కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాక ఆయిల్ వేసి వీటన్నిటిని కూడా మళ్లీ తిరిగి ఒకసారి బాగా కలుపుకోండి. చికెన్ మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ చికెన్ ని కనీసం ఒక గంట పాటు మన ఫ్రిజ్లో పెట్టుకోవాలి. మీరు ఎంత సేపు చికెన్ మ్యారినేట్ చేస్తే చికెన్ పకోడా అంత టేస్టీగా వస్తుంది. అన్నమాట చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఫ్రిజ్లో టూ అవర్స్ పాటు ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా చికెన్ పీసెస్ ని విడివిడిగా వేస్తూ ఈవెన్గా క్రిస్పీగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇలా ఈవెన్ గా ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా పక్కకు తీసుకుని ఉల్లిపాయ ఇంకా నిమ్మకాయతో సర్వ్ చేసుకోండి. టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా గనక మీరు చికెన్ పకోడీ చేస్తే మీ ఇంట్లో వాళ్లందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది