Chicken Fry Recipe : చికెన్ ఫ్రై ఫుల్ గ్రేవీ తో ఈ చికెన్ రోస్ని ట్రై చేయండి. రైస్ తో అయినా బిర్యానితో అయినా చక్కగా కలుపుకుని తినేసేయచ్చు. ఈవెన్ చపాతీలోకి కూడా ఈ చికెన్ రైస్ చాలా బాగుంటుంది. సూపర్ రెసిపీ సో ఆ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు.. చికెన్, ఆయిల్, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, జీడిపప్పు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, జీలకర్ర, సోంపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, బటర్ మొదలైనవి… ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పులు వేసి దోరగా వేయించి తర్వాత వీటిని పక్కకు తీసుకోండి. అలాగే ఒక ఫుల్ కప్ దాకా ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా స్లైసెస్ గా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లి ముక్కలు ఎంత బాగా వేగితే అంత గ్రేవీ చక్కగా వస్తుందన్నమాట. తర్వాత ఇందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి.
తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాక పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా కలపండి. నెక్స్ట్ ఇంట్లోకి ఒక కేజీ దాక బాగా శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకున్న చికెన్ ని మీడియం సైజులో కట్ చేసుకుని ఆ చికెన్ ని వేసేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ ముక్కల్లో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ తోనే చికెన్ అంతా కుక్ అయ్యేంతవరకు మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలండి. చికెన్ అనేది కంప్లీట్ గా 100% కుక్ అయిపోవాలి. తర్వాత ఇందులోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా చేసుకుని తీసుకోండి. అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా పుదీనా అలాగే బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేయండి. పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వీటిని వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా టాస్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని ఫైన్ పేస్ ల గ్రైండ్ చేసుకుని ఆ ప్యూరీ ని కూడా వేసేసేయండి. ఇందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి.
కారం యొక్క స్పైసినెస్ ని బట్టి ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత టమాటాలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం ఈ చికెన్ ఫ్రై లోకి కావాల్సిన అసలైన మసాలాని తయారు చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి. తర్వాత అర టీ స్పూన్ దాకా జీలకర్ర, అర టీ స్పూన్ దాకా సోంపు వేయండి. నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేయండి. ఇందులోనే ఒక రెండు ఇంచుల దాకా దాల్చిన చెక్క, ఆరేడు లవంగ మొగ్గలు, నాలుగు యాలకులు ఒక అనాసపువ్వు వేసుకోండి. చిన్న ముక్కైతే సరిపోతుంది. బిర్యాని ఆకు కూడా వేసేసిన తర్వాత ఇందులోని ఒక టీ స్పూన్ దాకా గసగసాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి ఫస్ట్ ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ని ఇప్పుడు మనం ఫ్రై లోకి ఆడ్ చేసుకోవాలండి. టమాటాలు అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయన్నమాట.
టమాటా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయింది. దగ్గరకి కొంచెం ఎగిరిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజిలో మనం తయారు చేసుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసి ఒక ఐదు పది నిమిషాల పాటు నూనెలోనే చక్కగా వేయించాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు కూడా మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ బాగా తిప్పుకుంటూ ఫ్రై చేయండి. అంతా కూడా దగ్గరికి అయిపోయి ఆల్మోస్ట్ తయారైపోయింది అని అనుకున్న స్టేజ్ లో ఫైనల్ గా ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకు, అలాగే వేయించుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసేసి హై ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి.చికెన్ ఫ్రై అనేది బాగా డ్రైగా ఉండకూడదు. అంతే చికెన్ ఫ్రై రోస్ట్ రెడీ. సూపర్ టేస్టీగా అండ్ వెరీ ఫ్లేవర్ ఫుల్ గా రెడీ అయిపోయిన ఈ చికెన్ రోల్స్ ని రైస్ తో బిర్యానితో, చపాతీతో ఎందులోకి సర్వ్ చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి..
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.