Gongura Chicken Recipe : ఈరోజు గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం.. గోంగూర చికెన్ కాంబినేషన్ చపాతీలో కైనా.. అన్నంలోకైనా బిర్యాని లోకైనా ఏ కాంబినేషన్ లో కైనా భలే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మంచిగా గ్రేవీగా వచ్చే విధంగా కొలతలు చూపిస్తున్నాను. ఈ గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు: గోంగూర, చికెన్, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, గరం మసాలా, జీలకర్ర,పుదీనా, కొత్తిమీర మొదలైనవి.. తయారీ విధానం: ఆయిల్ వేసుకొని కడాయి పెట్టి దాంట్లో రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని పావు కిలో వరకు గోంగూర వేసి మగ్గించుకోవాలన్నమాట.. మెత్తగా సాఫ్ట్ గా అయిపోయేంత వరకు కూడా మూత పెట్టుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత పేస్టులా చేసేసుకుని ఒక బౌల్ లోకి తీసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్ లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక చిన్న బిర్యాని ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క, నాలుగు లవంగ మొగ్గలు, యలుకాయలు వేయండి.
ఇవి కొంచెం వేగాక ఇందులోకి ముప్పావు కప్పు దాకా వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర సన్నగా చీల్చుకున్న నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగాక ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి.ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాను తీసుకుని ఇలా స్లైసెస్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఒక టీస్పూన్ దాకా ఉప్పు వేసేసి అంటే కూడా మిక్స్ చేసి ఈ టమాటా ముక్కలు సాఫ్ట్ గా మెత్తగా మగ్గిపోయేంత వరకు కూడా మగ్గించుకోండి. ఇలా టమాట ముక్కలు అనేవి సాఫ్ట్ గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ కేజీ దాకా క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసేసుకోండి.
చికెన్ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మగ్గిస్తే చికెన్ పీసెస్ అనేవి మెత్తగా అవుతాయి అన్నమాట. కారం వేసిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి కంప్లీట్ గా చికెన్ అంతా కూడా బాగా ఉడికి పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ అనేది పూర్తిగా ఉడికిపోయిన తర్వాత గోంగూర పేస్ట్ ను వేసేసి చికెన్ కి గోంగూర అంతా కూడా బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. అంత కూడా బాగా కలుసుకోవాలి. ఇలా గోంగూర చికెన్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్ లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిస్తే ఆయిల్ అనేది పైకి తేలుతుంది.. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత ఫైనల్ గా ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసి కలుపుకొని ఇక లాస్ట్ లో కొత్తిమీర పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే.. అంతే ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది. ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. అన్నంలో తిన్న బాగుంటుంది. చపాతీతో తిన్న బాగుంటుంది. బిర్యాని కూడా చాలా బాగుంటుంది
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
This website uses cookies.