
Prawns : చేపల ప్రియులకు శుభవార్త... అతి తక్కువ ధరకే రొయ్యలు...!
Prawns : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో తాజా రొయ్యలు మరియు చేపలు దర్శనం ఇస్తున్నాయి. సుమారుగా రెండు నెలల గ్రామం తరువాత విశాఖ సముద్ర జలల్లోకి ఫిషింగ్ బోర్డులో వేటకు బయలు దేరాయి. అయితే 60 రోజులపాటు చేపల వేటకు ప్రతి సంవత్సరం కూడా విరామం అనేది ప్రకటించడం జరుగుతుంది. అంతేకాక ఏ ఒక్కరు కూడా విరామం టైంలో వేటకు వెళ్ళవద్దు అని ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వడంతో మత్స్య సంపద మొత్తం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ టైంలో సముద్రంలో రొయ్యలు మరియు చేపలు చాలా బాగా పెరుగుతాయి. ఈనెల 15వ తారీకు అర్ధరాత్రి నుండి మత్స్యకారులు తిరిగి తమ వేటను మొదలుపెట్టారు. అయితే మొదటగా రొయ్యల వేట పైనే మత్స్యకారులు ఎక్కువగా దృష్టి పెట్టారు. నాలుగు రోజుల నుండి చేపల వేటకు వెళ్లే వారికి పింక్ బ్రౌన్ రొయ్యలు ఎక్కువగా దొరుకుతున్నాయి. దీని ఖరీదు వచ్చేసి మార్కెట్లో కేజీ రూ.200 వరకు ఉంది అని మత్స్యకారుల నాయకుడు ఆనంద్ తెలిపారు. హెర్బర్ కొచ్చి చాపల ప్రియులకు ఇది మంచి శుభవార్త అని చెప్పొచ్చు. అయితే స్థానిక అమ్మకాలు కాక పింకు బ్రౌన్ రొయ్యలకు విదేశాలలో ఎంతో డిమాండ్ ఉన్నది.
దీనిలో యూకే, యూరప్, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో పింక్ బ్రౌన్ రొయ్యలను ఎంతో ఇష్టంగా తింటారు. అక్కడ వీటి ధర వచ్చేసి ఎంతో ఎక్కువగా ఉంటుంది అని మత్స్యకారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఎగుమతి అనేది ఎక్కువగా లేకపోవడం వలన ఇక్కడ సరుకు అధికంగా ఉండటం వలన ధర తగ్గింది అని అంటున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ కు దగ్గరలో ఉన్న నగరవాసులకు తక్కువ ధరకే రొయ్యలు ఇస్తున్నామని మత్స్యకారుల నాయకుడు ఆనంద్ తెలిపారు… మొదట్లో రొయ్యలే ఎక్కువగా లభిస్తాయి అని వీరు తెలిపారు. వేట విరామం తర్వాత మత్స్యకారులకు మత్స్య సంపద ఎక్కువగా లభించటంతో కొంతవరకు ఊరట చెందారు. విశాఖ ఫిషింగ్ హెర్బర్ నుండి ఒడిశా మరియు శ్రీలంక సరిహద్దుల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను అనుసరించి వీరు వేట అనేది కొనసాగిస్తారు. అయితే వీరు సరిహద్దులు దాటకూడదు అనే స్పష్టమైన ప్రభుత్వ ఆదేశాలు కూడా ఉన్నాయి.
Prawns : చేపల ప్రియులకు శుభవార్త… అతి తక్కువ ధరకే రొయ్యలు…!
ప్రభుత్వ నియమం ప్రకారం మత్యకారులు తమ వేట కొనసాగించాలి. అయితే వేట విరామం టైంలో ప్రతి ఒక్కరి మత్స్యకారుడికి కూడా ప్రభుత్వం పదివేల రూపాయలను చెల్లిస్తుంది. కానీ ఎన్నికల కోడ్, కొత్త ప్రభుత్వ వచ్చిన తరుణంలో ఒక్క విశాఖపట్నం ప్రాంతాలలో మాత్రమే సుమారుగా 13 వేల మంది మత్స్యకారులకు వేట విరామం కరువు బత్యం చెల్లించాల్సి ఉంది అని మత్స్యకారుల నాయకుడు ఆనంద్ తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఈ భత్యాన్ని చెల్లించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు…
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.