Donne Biryani Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి బెంగళూరు స్పెషల్ ఆల్ టైం ఫేవరెట్ చికెన్ దున్నే బిర్యాని. ఈ బిర్యానీ ఎంత ఫ్లేవర్ ఫుల్ గా ఉంటుందో.. ఇది అన్ని బిర్యాని లకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే దీని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చికెన్ దోన్నే బిర్యాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు : చికెన్ పీసులు, పెరుగు, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, పుదీనా, మెంతికూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీర, అనాసపువ్వు, స్టార్, బండపు పువ్వు, బిర్యానీ ఆకు ఆయిల్, నెయ్యి, గుడ్లు, మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఒక బౌల్ లో ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు, ఒక కప్పు పెరుగు, వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఆఫ్ కేజీ చికెన్ ముక్కలను తీసుకొని బాగా మ్యారినేట్ చేసుకోనీ ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక రెండు కప్పులు చిట్టి ముత్యాల బియ్యాన్ని
తీసుకొని బాగా కడిగి ఒక గంట పాటు వాటిని కూడా నానబెట్టుకోవాలి. ఇక ఈ మసాలా పేస్ట్ కోసం స్టవ్ పై ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసి కొన్ని మిరియాలు కొన్ని యాలకులు ఒక దాల్చిన చెక్క లవంగాలు వేసి సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి వాటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక అదే ఆయిల్ లో పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. తర్వాత ఒక పిరకడు పుదీనా, ఒక పిరకడు కొత్తిమీర, మెంతికూర వేసి వేయించుకోవాలి. దానిని కూడా కళాయిలో నుంచి తీసి మా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ గిన్నెలో ఆయిల్ వేసుకొని దాంట్లో జాపత్రి, స్టార్ అనాసపువ్వు, స్టోన్ ఫ్లవర్, షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.
చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసి 15 నిమిషాల పాటు ఫ్రై తర్వాత దానిలోమూడు కప్పుల వేడివేడి నీటిని పోసుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక ఆ నీరు మరుగుతుండగా ముందుగా నానబెట్టుకున్న చిట్టి ముత్యాల బియ్యాన్ని కూడా వేసి బాగా కలుపుకొని ఒక పెద్ద నిమ్మకాయ రసం పిండుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని దాన్ని పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది.. ఇక తర్వాత దీనిలో ఉడకబెట్టుకున్న గుడ్లను ఒక మూడు తీసుకుని గాట్లు పెట్టుకొని దానిలో వేసుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పాటు వదిలేయాలి. ఇక పది నిమిషాల తర్వాత దానిని తీసి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా బెంగళూరు స్టైల్ చికెన్ దోన్ని బిర్యాని రెడీ..
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.