Donne Biryani Recipe : బెంగళూరు స్పెషల్ చికెన్ దొన్నె బిర్యాని…!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Donne Biryani Recipe : బెంగళూరు స్పెషల్ చికెన్ దొన్నె బిర్యాని…!!

Donne Biryani Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి బెంగళూరు స్పెషల్ ఆల్ టైం ఫేవరెట్ చికెన్ దున్నే బిర్యాని. ఈ బిర్యానీ ఎంత ఫ్లేవర్ ఫుల్ గా ఉంటుందో.. ఇది అన్ని బిర్యాని లకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే దీని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చికెన్ దోన్నే బిర్యాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు : […]

 Authored By prabhas | The Telugu News | Updated on :17 January 2023,6:00 pm

Donne Biryani Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి బెంగళూరు స్పెషల్ ఆల్ టైం ఫేవరెట్ చికెన్ దున్నే బిర్యాని. ఈ బిర్యానీ ఎంత ఫ్లేవర్ ఫుల్ గా ఉంటుందో.. ఇది అన్ని బిర్యాని లకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే దీని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చికెన్ దోన్నే బిర్యాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు : చికెన్ పీసులు, పెరుగు, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, పుదీనా, మెంతికూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీర, అనాసపువ్వు, స్టార్, బండపు పువ్వు, బిర్యానీ ఆకు ఆయిల్, నెయ్యి, గుడ్లు, మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఒక బౌల్ లో ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు, ఒక కప్పు పెరుగు, వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఆఫ్ కేజీ చికెన్ ముక్కలను తీసుకొని బాగా మ్యారినేట్ చేసుకోనీ ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక రెండు కప్పులు చిట్టి ముత్యాల బియ్యాన్ని

తీసుకొని బాగా కడిగి ఒక గంట పాటు వాటిని కూడా నానబెట్టుకోవాలి. ఇక ఈ మసాలా పేస్ట్ కోసం స్టవ్ పై ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసి కొన్ని మిరియాలు కొన్ని యాలకులు ఒక దాల్చిన చెక్క లవంగాలు వేసి సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి వాటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక అదే ఆయిల్ లో పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. తర్వాత ఒక పిరకడు పుదీనా, ఒక పిరకడు కొత్తిమీర, మెంతికూర వేసి వేయించుకోవాలి. దానిని కూడా కళాయిలో నుంచి తీసి మా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ గిన్నెలో ఆయిల్ వేసుకొని దాంట్లో జాపత్రి, స్టార్ అనాసపువ్వు, స్టోన్ ఫ్లవర్, షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.

Perfect Chicken Donne Biryani recipe in telugu

Perfect Chicken Donne Biryani recipe in telugu

చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసి 15 నిమిషాల పాటు ఫ్రై తర్వాత దానిలోమూడు కప్పుల వేడివేడి నీటిని పోసుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక ఆ నీరు మరుగుతుండగా ముందుగా నానబెట్టుకున్న చిట్టి ముత్యాల బియ్యాన్ని కూడా వేసి బాగా కలుపుకొని ఒక పెద్ద నిమ్మకాయ రసం పిండుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని దాన్ని పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది.. ఇక తర్వాత దీనిలో ఉడకబెట్టుకున్న గుడ్లను ఒక మూడు తీసుకుని గాట్లు పెట్టుకొని దానిలో వేసుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పాటు వదిలేయాలి. ఇక పది నిమిషాల తర్వాత దానిని తీసి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా బెంగళూరు స్టైల్ చికెన్ దోన్ని బిర్యాని రెడీ..

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది