Home » Andhra Pradesh » Nine Godavari Bank Branches Conducted Loan Mela Today
andhra pradesh

Guntur..గ్రామీణ బ్యాంకుల మెగా రుణమేళా

Authored By
praveen T
The Telugu News | Published on: September 8, 2021, 6:39 pm
Advertisement

జిల్లాలోని గురజాల నియోజకవర్గ కేంద్రంలో తొమ్మిది చైతన్య గోదావారి బ్యాంకు బ్రాంచీల మెగా రుణమేళాను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యుడు కాసు మహేశ్‌రెడ్డి పాల్గొన్నారు. గురజాలలో దాదాపు రూ.33 కోట్లు రుణంగా మంజూరు చేయగా, ఆ చెక్కులను ఎమ్మెల్యే మహిళా సంఘం సభ్యులకు అందజేశారు. ఈ రుణాలను బ్యాంకులు డ్వాక్రా, వైఎస్ఆర్ చేయూత, టిడ్కో గృహాలకుగాను ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాలు బ్యాంకులు ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

మహిళా సంఘాల ద్వారానే గ్రామాల్లో చైతన్యం సాధ్యమని తెలిపారు. మహిళలు అభివృద్ధి పథంలో నడిస్తే ఆటోమేటిక్‌గా సొసైటీ అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి చెప్పారు. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ మహిళా సంఘాలు రుణాలు సద్వినియోగం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కామేశ్వర్‌రావు, బ్యాంకు అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి