వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన ‘పొలంబడి’ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు బుధవారం తనిఖీ చేశారు. జిల్లాలోని రాజుపాలెం మండల పరిధిలోని కొర్రపాడు విలేజ్‌లో జరుగుతున్న పొలంబడి కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. పంట పొలాల వద్దకు వెళ్లి మరి అధికారులు, రైతులతో మాట్లాడారు. స్వయంగా మంత్రి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పొలంబడి కార్యక్రమంలో అధికారులను రైతులకు పంటల విషయమై ఎటువంటి సలహాలను ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.
పంట దిగుబడి పెరిగేలా, రైతులకు మేలు జరిగే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు పని చేయాలని మంత్రి కన్నబాబు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయంలో వినూత్న పద్ధతులపైన రైతులు దృష్టి పెట్టాలని, అవసరమైన సలహాలను వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తప్పకుండా తీసుకోవాలని మంత్రి సూచించారు. వైసీపీ ప్రభుత్వం అన్నదాత మేలు కోసం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. మంత్రి కన్నబాబు వెంట స్థానిక వైసీపీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.