Guntur..గ్రామీణ బ్యాంకుల మెగా రుణమేళా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guntur..గ్రామీణ బ్యాంకుల మెగా రుణమేళా

జిల్లాలోని గురజాల నియోజకవర్గ కేంద్రంలో తొమ్మిది చైతన్య గోదావారి బ్యాంకు బ్రాంచీల మెగా రుణమేళాను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యుడు కాసు మహేశ్‌రెడ్డి పాల్గొన్నారు. గురజాలలో దాదాపు రూ.33 కోట్లు రుణంగా మంజూరు చేయగా, ఆ చెక్కులను ఎమ్మెల్యే మహిళా సంఘం సభ్యులకు అందజేశారు. ఈ రుణాలను బ్యాంకులు డ్వాక్రా, వైఎస్ఆర్ చేయూత, టిడ్కో గృహాలకుగాను ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాలు బ్యాంకులు ఇచ్చే రుణాలను సద్వినియోగం […]

 Authored By praveen | The Telugu News | Updated on :8 September 2021,6:39 pm

జిల్లాలోని గురజాల నియోజకవర్గ కేంద్రంలో తొమ్మిది చైతన్య గోదావారి బ్యాంకు బ్రాంచీల మెగా రుణమేళాను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యుడు కాసు మహేశ్‌రెడ్డి పాల్గొన్నారు. గురజాలలో దాదాపు రూ.33 కోట్లు రుణంగా మంజూరు చేయగా, ఆ చెక్కులను ఎమ్మెల్యే మహిళా సంఘం సభ్యులకు అందజేశారు. ఈ రుణాలను బ్యాంకులు డ్వాక్రా, వైఎస్ఆర్ చేయూత, టిడ్కో గృహాలకుగాను ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాలు బ్యాంకులు ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మహిళా సంఘాల ద్వారానే గ్రామాల్లో చైతన్యం సాధ్యమని తెలిపారు. మహిళలు అభివృద్ధి పథంలో నడిస్తే ఆటోమేటిక్‌గా సొసైటీ అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి చెప్పారు. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ మహిళా సంఘాలు రుణాలు సద్వినియోగం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కామేశ్వర్‌రావు, బ్యాంకు అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది