Home » Andhra Pradesh » Two Crore Worth Gold Was Missing In Bank Of Baroda Bapatla Branch
andhra pradesh

Guntoor.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.2 కోట్ల బంగారం మాయం.. పీఎస్‌లో ఫిర్యాదు

Authored By
praveen T
The Telugu News | Published on: September 6, 2021, 1:52 pm
Advertisement

జిల్లాలోని బాపట్ల సిటీలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో రూ.రెండు కోట్ల విలువైన బంగారం గల్లంతు అయినట్లు బ్యాంక్ రీజినల్ మేనేజర్ తెలిపారు. ఈ విషయమై మేనేజర్ సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్యాంక్ మేనేజర్ బ్యాంకు అటెండర్ ప్యార్లీ ప్రశాంత్ రాజుపై అనుమానం వ్యక్తం చేశారు. ఇకపోతే రెండు కోట్ల రూపాయల విలువైన బంగారం అటెండర్ ఒక్కడే ఎలా మాయం చేయగలడనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

Advertisement

బ్యాంకులో అతడికి సాయంగా ఇంకెవరైనా ఉన్నారా? అనేది తేలాల్సి ఉంది. అయితే, అటెండర్ ప్యార్లీ ప్రశాంత్ రాజు పరారీలో ఉండటం పట్ల అతడిపైన అనుమానాలొస్తున్నాయి. అయితే, ఖాతాదారులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని, నిందితుడి కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతున్నామని సీఐ కృష్ణయ్య పేర్కొన్నారు. బ్యాంకులో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని కూడా పోలీసులు విచారించనున్నారు. బ్యాంకు ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీతో పాటు స్థానికంగా ఆ ఏరియాలో ఉండే ఇతర సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేయనున్నారు.

Advertisement

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి