Guntoor.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.2 కోట్ల బంగారం మాయం.. పీఎస్‌లో ఫిర్యాదు | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Guntoor.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.2 కోట్ల బంగారం మాయం.. పీఎస్‌లో ఫిర్యాదు

జిల్లాలోని బాపట్ల సిటీలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో రూ.రెండు కోట్ల విలువైన బంగారం గల్లంతు అయినట్లు బ్యాంక్ రీజినల్ మేనేజర్ తెలిపారు. ఈ విషయమై మేనేజర్ సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్యాంక్ మేనేజర్ బ్యాంకు అటెండర్ ప్యార్లీ ప్రశాంత్ రాజుపై అనుమానం వ్యక్తం చేశారు. ఇకపోతే రెండు కోట్ల రూపాయల విలువైన బంగారం అటెండర్ ఒక్కడే ఎలా మాయం చేయగలడనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులో అతడికి సాయంగా ఇంకెవరైనా ఉన్నారా? అనేది తేలాల్సి […]

 Authored By praveen | The Telugu News | Updated on :6 September 2021,1:52 pm

జిల్లాలోని బాపట్ల సిటీలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో రూ.రెండు కోట్ల విలువైన బంగారం గల్లంతు అయినట్లు బ్యాంక్ రీజినల్ మేనేజర్ తెలిపారు. ఈ విషయమై మేనేజర్ సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్యాంక్ మేనేజర్ బ్యాంకు అటెండర్ ప్యార్లీ ప్రశాంత్ రాజుపై అనుమానం వ్యక్తం చేశారు. ఇకపోతే రెండు కోట్ల రూపాయల విలువైన బంగారం అటెండర్ ఒక్కడే ఎలా మాయం చేయగలడనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

బ్యాంకులో అతడికి సాయంగా ఇంకెవరైనా ఉన్నారా? అనేది తేలాల్సి ఉంది. అయితే, అటెండర్ ప్యార్లీ ప్రశాంత్ రాజు పరారీలో ఉండటం పట్ల అతడిపైన అనుమానాలొస్తున్నాయి. అయితే, ఖాతాదారులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని, నిందితుడి కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతున్నామని సీఐ కృష్ణయ్య పేర్కొన్నారు. బ్యాంకులో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని కూడా పోలీసులు విచారించనున్నారు. బ్యాంకు ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీతో పాటు స్థానికంగా ఆ ఏరియాలో ఉండే ఇతర సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేయనున్నారు.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది