Kidney stones : వామ్మో.. కిడ్నీలో 156 రాళ్లు.. 3 గంటలు శ్రమించిన డాక్టర్లు..!
Kidney stones : ప్రస్తుతం చిన్న, పెద్ద వయస్సుతో తేడా లేకుండా చాలా మంది చాలా జబ్బుల బారిన పడుతున్నారు. వారిలో కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారు సైతం చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారికి చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారు. కిడ్నీలో మహా అయితే రెండు, మూడు రాళ్లు ఉంటాయి. ఇంకా ఎక్కువ అనుకుంటూ ఓ పది.వీటిని నయం చేసేందుకు కొందరు ఎక్కువగా నీరు తాగితే రాళ్లు కరిగిపోతాయని చెబుతుంటారు.
మరి కొందరు చెట్ల ఆకుల పసరుతో నాటు వైద్యం తీసుకోవాలని సలహా ఇస్తారు. సమస్యతో బాధపడేవారి కొన్ని మెడిసిన్స్ సహాయంతో నయం చేస్తారు. కొన్ని సందర్భాల్లో వాటిని బయటకు తీసేస్తారు. తాజాగా హైదరాబాద్ లో ఓ వ్యక్తి కిడ్నీలో రాళ్ల సమస్యతో వీపరీతంగా బాధపడుతూ ఆస్పత్రికి వచ్చాడు. ఇక రాళ్లను చూసిన డాక్టర్లు మొదట్లో షాక్ అయ్యారు.
Kidney stones : వేరే ప్లేస్‌లో కిడ్నీ..
కర్ణాటక రాష్ట్రానికి చెందిన మడివలార్ అనే వ్యక్తికి కడుపు నొప్పి రావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. మూత్ర కోశం దగ్గర ఉండాల్సిన కిడ్నీ కడుపు దగ్గర ఉన్నట్టు గుర్తించారు డాక్టర్లు.. దీనిని ఎక్టోపిక్ కిడ్నీ అంటారట. కోహోల్ సర్జరీ మెథడ్ లో ఎండోస్కోపి, లాప్రోస్కోపి విధానల ద్వారా అతని కిడ్నీలోంచి 156 రాళ్లను బయటకు తీశారు. ఇందుకు సుమారు డాక్టర్లు మూడు గంటలు కష్టపడ్డారు.