Beer kidney Stones : బీర్లు తాగే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం… కిడ్నీలో రాళ్లు కరుగుతాయా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beer kidney Stones : బీర్లు తాగే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం… కిడ్నీలో రాళ్లు కరుగుతాయా…?

 Authored By ramu | The Telugu News | Updated on :27 December 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Beer kidney Stones : బీర్లు తాగే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం... కిడ్నీలో రాళ్లు కరుగుతాయా...?

Beer kidney Stones : ఈ రోజుల్లో యువత, పెద్దవారు, అందరూ మద్యపానంకు బాగా అలవాటు పడిపోయారు. యువత పెడదారిన పడిపోయింది. సమాజంలో చాలామంది ఆల్కహాల్లు ఎక్కువగా సేవిస్తున్నారు. అందులో బీర్లు తాగే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువే. ఆడవారు, మగవారు అంటూ బేధం లేకుండా అందరూ బీర్లకి అలవాటు పడిపోయారు. ఏది ఏమైనా కానీ ఆల్కహాల్ ఏ రూపంలో తీసుకున్న ఆరోగ్యం వేగంగా పాడైపోవడం మాత్రం ఖాయం. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవు. అయితే కొంతమంది మాత్రం కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గాలంటే బీరు తాగితే వేగంగా కరిగిపోతాయని నమ్ముతారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలంటే విస్తృతంగా ప్రచారం కూడా చేస్తారు. అయితే వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే…
ప్రస్తుత కాలంలో వృద్ధుల్లోనే కాదు ఇవతల్లో కూడా కిడ్నీ స్టోన్ సమస్య వేగంగా పెరుగుతుంది. ఇది ఎక్కువగా మూత్రపిండాల పనితీరుపై ప్రభావితం చేస్తుంది. ఈ కిడ్నీ స్టోన్స్ ఉండడం వల్ల మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. కిడ్నీ స్టోన్స్ వ్యాధిగ్రస్తులు వీలైనంతవరకు ఎక్కువ నీరు తాగుతూ ఉండాలి. నీటి శాతం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బీరు ఎక్కువగా తాగితే రాళ్లు కరిగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఈ నానుడి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ప్రచారంలో ఉంటుంది. నిజంగానే బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయో లేదో నిపుణులు మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం..

Beer kidney Stones బీర్లు తాగే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం కిడ్నీలో రాళ్లు కరుగుతాయా

Beer kidney Stones : బీర్లు తాగే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం… కిడ్నీలో రాళ్లు కరుగుతాయా…?

Beer kidney Stones బీర్ తాగడం వల్ల కిడ్నీ సమస్యలు తగ్గుతాయా

కిడ్నీ సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పి, ఏ వైద్యుడు కూడా బీర్ తాగమని సలహా ఇవ్వరు.. అలాగే బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి అని ఎటువంటి పరిశోధనలు రుజువు చేయలేదు. శ్రీయంగా నిర్ధారణ కానందున కిడ్నీ వ్యాధిగ్రస్తులు బీరు వంటి ఆల్కహాల్ డ్రింక్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్పారు. బీర్లు అధికంగా తాగితే మూత్రంలో రాళ్లు నాయమవుతాయి అనేది ఉత్త అపోహ మాత్రమే.

మరింత ప్రమాదకరంగా : ఎవరికైనా సరే కిడ్నీ స్టోన్స్ సమస్య ఉంటే ఇటువంటి వారు వీరు తాగడం వల్ల మూత్రం వేగంగా ఒంట్లో ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా కిడ్నీ వాపు వస్తుంది. సమస్య మరింత త్రివరమయ్యే ప్రమాదం ఉంది. ఐదు నుంచి పది శాతం మందికి మాత్రమే కిడ్నీలో రాళ్లకు ఖచ్చితంగా కారణం తెలుసు. కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో చాలామందికి తెలియదు. సాధారణంగా తక్కువ నీరు తాగే వారికి, అధిక ప్రోటీన ఆహారం తీసుకునే వ్యక్తుల్లో ఇతరుల కంటే మూత్రపిండాలు రాలా అభివృద్ధి చెందే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.

ప్రోటీన్ ఫుడ్స్ వల్ల రాళ్లు వస్తాయా : ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ప్రొటీన్ ఆహారాలు తీసుకున్నప్పుడు కిడ్నీలో క్యాల్షియం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది కిడ్నీ స్టోన్స్ ను సమస్యలను తెస్తుంది. దీని ప్రకారం కిడ్నీ స్టోన్ సమస్యలను నివారించడానికి ప్రతిరోజు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాకు ఎక్కువ ద్రవ రూపంలో ఆహారం తీసుకోవాలి. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు వైద్యులు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది