Adulteration Milk : పాలలో కల్తిని గుర్తించేందుకు సరికొత్త దారి.. ఈజీగా ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు..
Adulteration Milk : మన జీవిస్తున్న జీవనశైలిలో పాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు నిత్యం పాలు లేకుండా రోజు గడవదు. చాలామంది పాలతో ఎన్నో రకాల వంటకాలను చేస్తూ ఉంటారు. అటువంటి పాలలో కల్తీని ఏ విధంగా గుర్తుంచాలి. పాలలో స్వచ్ఛమైన పాలు తెలుసుకోవాలంటే.. ఇంట్లోనే ఈజీగా పాల స్వచ్ఛతను గుర్తించవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం… కల్తీ పాలని గుర్తించే పద్ధతులు : మీరు తీసుకునే పాలలో ఎలాంటి సింథటిక్ ఉన్న పాల సువాసనను కనుక్కోవడం చాలా ఈజీ. అలాగే పాలు తాగుతున్నప్పుడు దాని సువాసన చిన్నగా ప్రారంభమవుతుంది. సింథటిక్ పాలను దాడిని చెడువాసన చెడు రుచిని బట్టి గుర్తించవచ్చు. ఒక్కొక్క టైంలో పాలు సబ్బులు సువాసన లాగా వస్తూ ఉంటాయి. అటువంటి పాలను మీరు ఒకసారి బయటికి తీసి వేలితో చెక్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పాలని చేతిలోకి తీసుకొని రుద్దినట్లయితే కొంచెం సబ్బు రసాయనాలుగా అనిపిస్తే అది సబ్బు మిశ్రమంతో తయారైనట్లు.
అలాగే పాలు కింద ఒలికి పోయినప్పుడు అది మరుక్షణమే అవి పారుతూ ఉంటాయి. ఇది అందరికీ దాదాపు తెలిసిన విషయమే. అయితే కల్తీ లేని పాలు ఏ విధంగా ప్రవహిస్తాయో తెలుసా.? కల్తీ పాలని అరికట్టడానికి ఇది ఈజీ అయిన దారి. ఏదైనా మెత్తటి ఉపరితలంపై రెండు మూడు పాల చుక్కలను వేయండి. అవి చిన్నగా ఎటో ఒకవైపు జారుతూ ఉంటాయి. అలా పాలు జారిన మార్గంలో తెల్లగా కనిపిస్తే అవి నాణ్యత గల పాలే. ఒకవేళ కల్తీ పాలే అయితే స్పీడ్ గా జారిపోతూ ఉంటాయి. పాలు జారిన మార్గంలో ఏమీ తెల్లగా కనిపించదు. అలాగే పాలతో ఎన్నో పదార్థాలను తయారు చేస్తూ ఉంటారు. స్వీట్లు తయారు నుండి వంట వరకు చాలావరకు వినియోగిస్తూ ఉంటారు. పాలతో చేసిన కోవా ను స్వీట్లుగా వినియోగిస్తూ ఉంటారు. పాలను కనిపెట్టడానికి ఇంట్లోనే కోవా కూడా రెడీ చేసి గుర్తించవచ్చు.
పాలకోవా రెడీ అయ్యే వరకు స్పూన్తో కలుపుతూ తక్కువ మంట మీద వేడి చేస్తూ దింపి తర్వాత రెండు మూడు గంటలు వేచి చూడండి.. కోవా మెత్తగా, నూనెగా ఉంటే పాలు మంచివి అని అర్థం. ఒకవేళ అది గట్టిగా సింథటిక్లా అనిపిస్తే అవి కల్తీ అని అర్థం. అలాగే యూరియా కల్తీ పాలు అత్యంత సహజ రూపం. ఇది రూపాన్ని మార్చదు.. రుచిని మార్చదు.. దీనిని కనుక్కోవడం చాలా కష్టం. ఈ యూరియా ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమైనది. ఈ యూరియా పాలను కనిపెట్టడం లిట్మస్ పేపర్ ను వినియోగించాలి. దీనికోసం కొన్ని పాలు సోయాబీని దానిలో వేసి బాగా కలపాలి. ఒక పది నిమిషాల తర్వాత దానిలో ఎర్రని లిటమస్ పేపర్ ను ముంచాలి. ఆ పేపర్ ఎరుపు కలర్ నుండి నీలి కలర్ లోకి రూపం మారిస్తే దాన్లో యూరియా కలిపినట్లే. ఆపాలు ఎంతో ప్రమాదకరమైనది.