Ajwain Tea : ఖాళీ కడుపుతో వాము టీ తాగండి చాలు… ఈ వేసవిలో అదిరిపోయే బెనిఫిట్స్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ajwain Tea : ఖాళీ కడుపుతో వాము టీ తాగండి చాలు… ఈ వేసవిలో అదిరిపోయే బెనిఫిట్స్…!

 Authored By ramu | The Telugu News | Updated on :19 April 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Ajwain Tea : ఖాళీ కడుపుతో వాము టీ తాగండి చాలు... ఈ వేసవిలో అదిరిపోయే బెనిఫిట్స్...!

Ajwain Tea  : అందరూ టీ, కాఫీలు సహజంగా తాగుతూ ఉంటారు. కొందరైతే టీ, కాఫీలు తాగకుండా ఏ పని మొదలు పెట్టరు. అయితే పాలతో తయారుచేసిన టీ, కాఫీల కన్నా వాము టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.. పూర్వం మసాలా దినుసులలో వాము ఒకటి. దీనిని ఆంగ్లంలో అజ్వైన్ అని పిలుస్తారు. వేసవిలో కచ్చితంగా తాగాల్సిన డ్రింకులలో ఇది ఒకటి. ఖాళీ కడుపుతో ఒక కప్పు వాము టీ తాగడం వలన జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది. బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో కూడా అజ్వైన్ ను శక్తివంతమైన కేల్న్సర్ గా చెప్తారు. అజ్వైన్ తీసుకోవడం వలన కడుపుబ్బరం ఎసిడిటీ మలబద్దకం లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వామును నిత్యం తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

ఈ మసాలా దినుసు అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడంతోపాటు బ్యాక్టీరియా ఫంగస్ లతో పోరాడడానికి ఉపయోగపడుతుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయకారిగా ఉంటుంది. వాము పెప్టిక్ అల్సర్లను తగ్గిస్తుంది.

Ajwain Tea ఖాళీ కడుపుతో వాము టీ తాగండి చాలు ఈ వేసవిలో అదిరిపోయే బెనిఫిట్స్

Ajwain Tea : ఖాళీ కడుపుతో వాము టీ తాగండి చాలు… ఈ వేసవిలో అదిరిపోయే బెనిఫిట్స్…!

Ajwain Tea  : వాము టీ వలన ఉపయోగాలు

వేసవికాలంలో ఖాళీ కడుపుతో వాము టీ తాగడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం…

-జీవ క్రియను మెరుగుపరుస్తుంది: వాము టీ జీవ క్రియను పెంచుతుంది. ఇది బరువు నిర్వహణకు ఉపయోగపడుతుంది. వాము టీ మొత్తం జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన జీవ క్రియ వలన బరువు కంట్రోల్లో ఉంటుంది.

Ajwain Tea  : టాక్స్ లో సహాయకారిగా

వాము టీ తీసుకోవడం వలన అదనపు ప్రయోజనం కూడా కలుగుతుంది. అదే డీటాక్సిఫికేషన్ . వాము తినడం వల్ల మూత్ర విసర్జన సవ్యంగా జరుగుతుంది. మూత్ర విసర్జన ద్వారా వ్యర్ధాలు విషాలను బయటకు తీయడానికి శరీరానికి ప్రోత్సహిస్తుంది.

Ajwain Tea  : కడుపుబ్బరం నుంచి ఉపశమనం

ఉబ్బరం గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించుకోవడానికి వాము టీ ఉత్తమం. వాములో ఉండే కార్మినేటివ్ లక్షణాలు గ్యాస్ కడుపుబ్బరం లాంటివి రాకుండా రక్షిస్తాయి.

-ఆకలిని పెంచుతుంది: వాము టీ ఆకలిని పెంచుతుంది. వేసవి వేడి ఆకలి వేయకుండా అడ్డుకుంటుంది. ఈ టీ తాగడం వలన ఆకలి వేస్తుంది. వాము టీ జీర్ణ వ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది. ఇది ఆరోగ్యకరమైన ఆకలిని పెంచుతుంది.

Ajwain Tea ఖాళీ కడుపుతో వాము టీ తాగండి చాలు ఈ వేసవిలో అదిరిపోయే బెనిఫిట్స్

Ajwain Tea : ఖాళీ కడుపుతో వాము టీ తాగండి చాలు… ఈ వేసవిలో అదిరిపోయే బెనిఫిట్స్…!

-వాము టీ జీర్ణక్రియను పెంచుతుంది. పొట్ట ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. వాములోని తైమెల్ ఇతర క్రియశీల పదార్థాలు గ్యాస్ట్రిక్ రసాలను ప్రేరేపించడానికి ఉపయోగపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం అసిడిటీ లాంటి లక్షనాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి భోజనం తర్వాత కడుపునొప్పి వస్తుంది. అలాంటి వారికి ఇది గొప్ప ఔషధం లాగా ఉపయోగపడుతుంది.

వాము టీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. ఒక కప్పు వేడి నీటిలో ఒక టీ స్పూన్ వాము వేసి బాగా మరిగించాలి. అంతే వాము టీ రెడీ అయిపోతుంది. కొన్ని నిమిషాల తర్వాత దానిని వడకట్టి ఒక కప్పులో పోసుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. దీనిలో రుచి కోసం తేన, బ్లాక్ సాల్ట్, నిమ్మరసం లాంటివి కూడా కలుపుకోవచ్చు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది